iDreamPost
android-app
ios-app

నెలనెలా చీటీలు కడుతున్నారా? అయితే.. ఈ ఘరానా మోసం తెలుసుకోండి!

పిల్లలు ఫీజులు లేదా పెళ్లికో, ఇంట్లో అవసరాలకు అక్కరకు వస్తాయని నెల నెలా చీటీలు వేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే పొంచి ఉంటున్నారు కేటుగాళ్లు. నమ్మారా.. నట్టేట మునిగినట్లే.

పిల్లలు ఫీజులు లేదా పెళ్లికో, ఇంట్లో అవసరాలకు అక్కరకు వస్తాయని నెల నెలా చీటీలు వేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే పొంచి ఉంటున్నారు కేటుగాళ్లు. నమ్మారా.. నట్టేట మునిగినట్లే.

నెలనెలా చీటీలు కడుతున్నారా? అయితే.. ఈ ఘరానా మోసం తెలుసుకోండి!

మహిళలు కనిపించని ఆర్థిక వేత్తలు. భర్త సంపాదనంలో కొంత భాగాన్ని దాచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పోపుల పెట్టే దగ్గర నుండి బ్యాంకు, పోస్టాఫీసులో పొదుపు వంటివే కాకుండా నెల నెలా చీటీలు కూడా కడుతుంటారు. అవి కూడా అత్యవసర పరిస్థితుల్లో కుటుంబానికి ఆసరాకు, అక్కరకు వస్తాయన్న ఉద్దేశంతో చిట్టీలు వేస్తుంటారు. కొంత మంది మహిళలు ఒక్క చోట కూడి.. చీటి పాటలా పాడి..ఎంత కట్టాలో నిర్ణయించి.. ఆ నెల ఎవరు పాడుకున్నారో వారికి అందిస్తుంటారు. పిల్లల చదువుకో, లేదా బంగారం చేయించుకోవాలనో, పిల్ల పెళ్లికో, ఇంటికి, మరో ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు వస్తాయని ఈ చిట్టీలు వేస్తుంటారు. ఇది కేవలం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఇప్పుడు పెద్ద బిజినెస్‌గా కూడా తయారయ్యింది. అలాగే మోసాలు కూడా మొదలయ్యాయి.

తిని తినక, ఏదో కూడబెడదామని నెలా నెల చీటీలు వేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. సరికొత్త చీటింగ్ మొదలైంది. చీటి పేరుతో డబ్బులు వసూలు చేసి చివరకు బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా పెద్ద మోసం బయటకు వచ్చింది. విశాఖ నగరంలో భార్యా భర్తలిద్దరూ చీటీల పేరుతో రూ. 10 కోట్ల సొమ్మును ప్రజల నుండి వసూలు చేసి పరారయ్యారు. చిట్టీలు వేసిన మహిళలు, ఇతరులు వీరు కనిపించకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన గాజువాకలోని వాంచే కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మరడాన పరుశురాం చీటీలు నిర్వహించేవాడు. తొలుత డబ్బులు బాగా ఇచ్చేవాడు. దీంతో నమ్మకస్తుడని అతడి దగ్గర చీటి వేయడం స్టార్ట్ చేశారు. అలా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అడుగుపెట్టాడు పరుశురాం.

వాంబేకాలనీ, ప్రియదర్శిని కాలనీ, బాపూజీ కాలనీ, సంజీవ్ గిరి కాలనీ, వికాస్ నగర్, గాజువాక ప్రాంతాలతో పాటు తెలంగాణలో పలు ప్రాంతాలలో పలు చీటీలు, రియల్ ఎస్టేట్ పేరుతో పేరుతో సుమారు రూ 10 కోట్ల వసూలు చేశాడు. అయితే ఉన్న పళంగా భార్యా, భర్త, బిడ్డలతో సహా పరారయ్యారు. ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ రావడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు గతంలో అగ్రిగోల్డ్‌లో పని చేశాడని ఆ పరిచయాలు మీద అందరూ చీటీలు కట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ తరహా మోసం ఇది కొత్తది కాదు. గతంలో కూడా చాలా మంది ఇలాగే మోసం చేశారు. వ్యక్తులే కాదు.. చిట్ ఫండ్ సంస్థలు కూడా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన దాఖలాలున్నాయి. అక్కరకు, అవసరానికి వస్తాయని చీటీలు వేస్తుంటే.. వారి నోటిలో మట్టికొడుతున్నారు కేటుగాళ్లు.