Chiranjeevi
టాలీవుడ్ లో గత కొంత కాలంగా ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. హీరోల కోసం, దర్శకుల కోసం ఎలివేషన్లు ఇవ్వడం ఈ ట్రెండ్.
టాలీవుడ్ లో గత కొంత కాలంగా ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. హీరోల కోసం, దర్శకుల కోసం ఎలివేషన్లు ఇవ్వడం ఈ ట్రెండ్.
Chiranjeevi
టాలీవుడ్ లో గత కొంత కాలంగా ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. హీరోల కోసం, దర్శకుల కోసం ఎలివేషన్లు ఇవ్వడం ఈ ట్రెండ్. ఈ ఎలివేషన్లు ఎలా ఇస్తారు అంటే ఆ హీరో చేస్తున్న సినిమాకు అంత ఖర్చు..ఇంత ఖర్చు అన్న దగ్గర ప్రారంభం అవుతుంది. ఆ తరువాత ఓటిటి డీల్ కాగానే దాన్ని దాచి పెట్టి, ఇంతకు అడుగుతున్నారు..అంతకు అడుగుతున్నారు అనేది స్టార్ట్ చేస్తారు.
కొంచెం గ్యాప్ ఇచ్చి అంత రేటు వచ్చింది అని ఎవరో ఒకరికి లీక్ ఇస్తారు. అలా మెల్లగా జనాల్లోకి దాన్ని పంపించి ఖరారు చేస్తారు. ఇంక అదే ఖాయం అయిపోతుంది. కాదని నిర్మాతకు తెలిసినా మౌనంగా వుండాల్సిందే. ఎందుకంటే కాదంటే హీరోకి కోపం వస్తుంది కనుక. 35 కోట్లు ఓటిటి అంటే 70 కోట్లు అంటారు. డెభై కోట్లు నాన్ థియేటర్ అంటే వంద కోట్లు ప్రచారం లోకి తెస్తారు.
ఇదిలా వుంటే ప్రతి హీరోకి ఏదో ఒక వీక్ నెస్ ప్రచారంలో వుంటుంది. షూటింగ్ కు తరచు డుమ్మా కొడుతూ వుంటారని, డూప్ లు ఎక్కువ వాడతారని, టైమ్ కు రారని, ఇలా ఏదో ఒకటి ప్రచారంలో వుంటుంది ప్రతి హీరోకి. ఇక్కడ దృష్టి పెడుతుంది ఫీలర్ల ప్రచారం. హీరో పగలు రాత్రి కష్టపడిపోతున్నాడని, లేదా డైరక్టర్ కు సరెండర్ అయిపోయాడని, అస్సలు ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టడం లేదని, ఇలా రకరకాలుగా ఫీలర్లు వదులుతారు.
ఈ ఫీలర్లు కూడా అన్నీ చాలా వెల్ ప్లాన్డ్ గా వదులుతారు. వెబ్ సైట్ లకు ఎక్స్ క్లూజివ్ ఇన్ ఫో అన్నట్లు కొన్ని వదులుతారు. ట్విట్టర్ హ్యాండిల్స్ కు ఎక్స్ క్లూజివ్ అన్నట్లు మరి కొన్ని వదలుతారు. ఎప్పుడైతే ఎక్స్ క్లూజివ్ అనగానే అందరూ హ్యాపీగా వాడేస్తారు. అవే నిజంగా జనాల్లోకి చలామణీ లోకి వెళ్లిపోతాయి. ఒకరు వేసిన తరువాత ఒక్కొక్కరుగా అన్ని చోట్లా ఇదే ప్రచారంలోకి తీసుకువస్తారు.
ఇప్పుడు ఇదే ట్రెండ్. ఈ ట్రెండ్ వల్ల ఎవరికీ ఏ హానీ లేదు.. ఫ్యాన్స్ హ్యాపీ.హీరోలు హ్యాపీ..ఎక్స్ క్లూజివ్ లీడ్స్ దొరికాయి అని మీడియా హ్యాపీ. కానీ నిర్మాతలు, దర్శకులు మాత్రం లోలోపల అసలు విషయాలు అణిచేసుకుంటూ, బాధ అణచుకుంటూ వుంటారు.