iDreamPost
android-app
ios-app

School Holiday: తెలుగు ప్రజలకు అలర్ట్‌.. అతి భారీ వర్షాలు.. అక్కడ స్కూల్స్‌కి 2 రోజులు సెలవులు

  • Published Jul 19, 2024 | 9:02 AM Updated Updated Jul 19, 2024 | 10:36 AM

School Holiday In Eluru-Heavy Rains In AP: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్‌ జారీ చేసింది. అతి భారీ వర్షాల నేపథ్యంలో.. నేడు కొన్ని ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఆ వివరాలు..

School Holiday In Eluru-Heavy Rains In AP: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్‌ జారీ చేసింది. అతి భారీ వర్షాల నేపథ్యంలో.. నేడు కొన్ని ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఆ వివరాలు..

  • Published Jul 19, 2024 | 9:02 AMUpdated Jul 19, 2024 | 10:36 AM
School Holiday: తెలుగు ప్రజలకు అలర్ట్‌.. అతి భారీ వర్షాలు.. అక్కడ స్కూల్స్‌కి 2 రోజులు సెలవులు

ఈసారి నైరుతు రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. దాంతో జూన్‌ నెల ప్రారంభం నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక జూలై నెలలో బంగాళఖాతంలో వరుసగా అల్ప పీడనాలు ఏర్పడుతుండటంతో.. ఆ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల మీద పడింది. ఇప్పటికే గత ఐదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగానే.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలుపుతుంది. ఆ తరువాత వచ్చే 24గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఒడిశా వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

పైగా అల్ప పీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. దీంతో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జోరు వానల నేపథ్యంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆ వివరాలు..

అల్ప పీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నేడు అనగా శుక్రవారం నాడు..  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం. అలానే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

భారీ వర్షాల నేపథ్యంలో నేడు మన్యంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏజెన్సీ మండలాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ఐటీడీఏ పి ఓ సూర్య తేజ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈమేరకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలానే విశాఖ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు (జులై 19) అన్నీ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌ హరేంధిర ప్రసాద్‌ ప్రకటించారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాల కారణంగా అన్నీ స్కూళ్లకు నేడు, రేపు స్థానిక సెలవుగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు.

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. విద్యార్థులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. అలానే కోస్తాలోని కొన్ని జిల్లాలు, కర్నూలు, రాయలసీమలోని నంద్యాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

రేపు కోస్తాలోని కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీసే ఛాన్స్‌ ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని అధికారులు సూచించారు. అలానే వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని.. సాధ్యమైనంత వరకు చెరువులు, నదులు దాటే ప్రయత్నం చేయవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.