iDreamPost
android-app
ios-app

APEPDCL Recruitment 2024: విద్యుత్‌ సంస్థలో జాబ్స్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం పొందే ఛాన్స్..

APEPDCL Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. రాత పరీక్ష లేకుండానే విద్యుత్ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది.

APEPDCL Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. రాత పరీక్ష లేకుండానే విద్యుత్ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది.

APEPDCL Recruitment 2024: విద్యుత్‌ సంస్థలో జాబ్స్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం పొందే ఛాన్స్..

జాబ్ సాధించాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి. ఇంటర్వ్యూలు ఎదుర్కోవాలి. ఇలా అన్ని దశల్లో ప్రతిభ కనబరిస్తే తప్పా ఉద్యోగం వరించదు. మరి మీరు మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. రాత పరీక్ష లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. అభ్యర్థులను ఇంటర్య్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? ఆ వివరాల్లోకి వెళ్తే..

ఏపీలోని తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మేనేజర్/ ఐటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లై చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం 5-8 ఏళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్లు మించకూడదు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం ఖాళీల సంఖ్య: 05.
  • మేనేజర్- ఐటీ/ డేటా అనలిటిక్స్: 01
  • మేనేజర్- ఐటీ/ డేటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్: 01
  • మేనేజర్- ఐటీ/ సైబర్ సెక్యూరిటీ: 01
  • మేనేజర్- ఐటీ/ శాప్‌: 01
  • మేనేజర్- ఐటీ/ మొబైల్ అప్లికేషన్స్: 01

అర్హత:

  • పోస్టును అనుసరించి బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం 5-8 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • నోటిఫికేషన్ జారీ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌లైన్‌ విధానంలో వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూరించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీని త్వరలో వెల్లడించనున్నారు.

ఇంటర్వ్యూ వేదిక:

  • చీఫ్ జనరల్ మేనేజర్/ హెచ్‌ఆర్‌డీ, ఏపీఈపీడీసీఎల్‌, కార్పొరేట్ కార్యాలయం, సీతమ్మధార, విశాఖపట్నం.