iDreamPost

Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ రైలుపై బిగ్ అలెర్ట్!

Vande Bharat Express: దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు దూసుకెళ్తున్నాయి. రోజు రోజుకూ వీటికి ఆదరణ బాగా పెరుగుతోంది. త్వరగా ఊర్లకు వెళ్లాలని భావించే వారు.. వందే భారత్ రైళ్లనే వినియోగిస్తున్నారు. తాజాగా ఈ రైలుకు సంబంధించి ఓ కీలక అలెర్ట్ వచ్చింది.

Vande Bharat Express: దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు దూసుకెళ్తున్నాయి. రోజు రోజుకూ వీటికి ఆదరణ బాగా పెరుగుతోంది. త్వరగా ఊర్లకు వెళ్లాలని భావించే వారు.. వందే భారత్ రైళ్లనే వినియోగిస్తున్నారు. తాజాగా ఈ రైలుకు సంబంధించి ఓ కీలక అలెర్ట్ వచ్చింది.

Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ రైలుపై బిగ్ అలెర్ట్!

దేశంలోనే అతి పెద్ద వ్యవస్థల్లో రైల్వే వ్యవస్థ ఒకటి. దీని ద్వారా నిత్యం లక్షల మంది ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. అంతేకాక మిగిలిన వాటితో పోలిస్తే ట్రన్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి. దీంతో వీటిల్లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇండియన్ రైల్వే శాఖ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేక సదుపాయాలను ప్రయాణికులకు అందిస్తుంది. అందులో భాగంగా వచ్చిందే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు. ప్రస్తుతం ఈ ట్రైన్లు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పరుగులు పెడుతున్నాయి. అలానే మన తెలుగు రాష్ట్రాలలో కూడా వందే భారత్ రైలు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా విశాఖ, సికింద్రాబాద్ వందే భారత్ రైలు విషయంలో ఓ బిగ్ అలెర్ట్ వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు దూసుకెళ్తున్నాయి. రోజు రోజుకూ వీటికి ఆదరణ బాగా పెరుగుతోంది. త్వరగా ఊర్లకు వెళ్లాలని భావించే వారు.. వందే భారత్ రైళ్లనే వినియోగిస్తున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రయాణికులకు మరింత చేరవు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 51 రైళ్లు పలు నగరాలను కలుపుతూ పరుగులు పెడుతున్నాయి. సాధారణ రైళ్లల్లో  లేని కొన్ని ప్రత్యేకతలు, అలానే వేగం వంటివి వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఉండటంతో డిమాండ్ బాగా పెరిగింది.

సాధారణ ట్రైన్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ త్వరగా తమ గమ్యస్థానం చేరేందుకు వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు. ఇది ఇలా ఉంటే.. విశాఖ పట్నం, సికింద్రాబాద్ మధ్య నడిచే 20833 వందేభారత్ రైలు విషయంలో కీలక అప్ డేట్ వచ్చింది. ఈ ట్రైన్ కొన్ని కారణలతో రీషెడ్యూల్ అయింది. 4 గంటల పాటు ఆలస్యంగా ఈ  రైలు నడుస్తోంది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ సర్వీస్‌ను రీ షెడ్యూల్ చేశారు రైల్వే అధికారులు. విశాఖపట్నం నుంచి తెల్లవారు జామున 5:45 నిమిషాలకు బయలు దేరాల్సి ఉండగా..సాంకేతిక లోపంతో టైమింగ్ మార్చారు. దీంతో ఉదయం 5.45కి బదులు ఉదయం 10 గంటలకు ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరింది.

ఈ ట్రైన్ వైజాగ్ నుంచి బయలుదేరక ముందే సీ 9 కోచ్‌లో టెక్నికల్ ఇష్యూ ఏర్పడింది. ఈ సమస్యను గుర్తించిన అధికారులు దాన్ని సరి చేశారు. అందుకోసం 4 గంటల సమయం పట్టింది. ఫలితంగా ఈ రైలు సమయాన్ని రీ షెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2:25 నిమిషాలకు సికింద్రాబాద్ చేరాల్సి ఉండగా.. 6:15 నిమిషాలకు వస్తుంది. మొత్తంగా నిర్ణీత సమయంలో ప్రకారం తిరిగి మధ్యాహనం 3 గంటలకు సికింద్రబాద్ నుంచి బయలు దేరి..రాత్రి  11.30 గంటలకు విశాఖ పట్నం చేరాల్సి ఉంది. అయితే ఈ నాలుగు గంటల ఆలస్యం కారణంగా లేటుగా చేరుకుంటుంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి