Chiranjeevi
గురువారం నాడు సినిమా విడుదల. సోమవారం బుకింగ్స్ ఓపెన్.
గురువారం నాడు సినిమా విడుదల. సోమవారం బుకింగ్స్ ఓపెన్.
Chiranjeevi
గురువారం నాడు సినిమా విడుదల. సోమవారం బుకింగ్స్ ఓపెన్. అది కూడా హైదరాబాద్ మొత్తం థియేటర్లు మొత్తం పరిచేసారు. జననాయకుడు డబ్బింగ్ సినిమా. స్ట్రయిట్ తెలుగు సినిమా కాదు. పైగా తెలుగు సినిమా భగవంత్ కేసరి కి ఫ్రీమేక్ ఇది. మరి జనం ఏ మేరకు టికెట్ ల కోసం ఎగబడతారు అనే ఆలోచన లేకుండా థియేటర్లు పరిచేసారు. ఎందుకో మరి. అది కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచే షో లు పెట్టేసారు. డబ్బింగ్ సినిమా సంగతి ఇలా వుంటే ఇదే వారం విడుదలవుతున్న స్ట్రయిట్ సినిమా చెన్నయ్ లవ్ స్టోరీ ఇంకా బుకింగ్ లు స్టార్ట్ చేయలేదు. అసలు ఆ సినిమా వుందనే ఆలోచనతోనే జననాయకుడు ఇన్ని థియేటర్లు బ్లాక్ చేసేసారు అనే మాట వినిపిస్తోంది.
నిజంగా అలా చేసి వుంటే అది కచ్చితంగా పిచ్చి పని అవుతుంది. ఎందుకంటే థియేటర్లు ఆపగలిగేది ఒక్క రోజు మాత్రమే. రెండో రోజు నుంచి సినిమానే ఆపాలి. ఇలా ఇన్ని థియేటర్లు పరిచేసి, ఎర్లీ షో లు వేసేస్తే డే వన్ తరువాత థియేటర్లు వెల వెల లాడే ప్రమాదం వుంది. హిట్ టాక్ వస్తే ఒకె. లేదంటే చాలా రిస్క్. కానీ ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు.
జననాయకుడు సినిమా తెలుగు నాట నిర్మాణ సంస్థ పంపిణీకే ఇచ్చింది తప్ప నాన్ రికవరబుల్ అడ్వాన్స్ కు ఇవ్వలేదు. అందువల్ల డిస్ట్రిబ్యూటర్లకు రిస్క్ లేదు. నిర్మాతకే రిస్క్. ఇటీవల విజయ్ సిఎమ్ అయ్యాక తెలుగు నాట కూడా అతని మీద క్రేజ్ పెరిగింది. అందుకే ఈ రిస్క్ చేస్తున్నారేమో మరి?