iDreamPost
android-app
ios-app

నిన్న మిస్ వైజాగ్ నక్షత్ర భర్తతో కలిసి దొరికిన అమ్మాయి ఎవరు? ఆమె పూర్తి వివరాలు!

  • Published May 31, 2024 | 12:33 PM Updated Updated Jun 01, 2024 | 3:33 PM

Miss Vizag Nakshtra: మిస్‌ వైజాగ్‌ నక్షత్ర భర్త.. మరో మహిళతో ఉండగా.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నక్షత్ర భర్తతో ఉన్న మహిళ ఎవరంటే..

Miss Vizag Nakshtra: మిస్‌ వైజాగ్‌ నక్షత్ర భర్త.. మరో మహిళతో ఉండగా.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నక్షత్ర భర్తతో ఉన్న మహిళ ఎవరంటే..

  • Published May 31, 2024 | 12:33 PMUpdated Jun 01, 2024 | 3:33 PM
నిన్న మిస్ వైజాగ్ నక్షత్ర భర్తతో కలిసి దొరికిన అమ్మాయి ఎవరు? ఆమె పూర్తి వివరాలు!

నిన్నటి నుంచి మీడియా, సోషల్‌ మీడియాలో మిస్‌ వైజాగ్‌ నక్షత్రకు సంబంధించిన వార్తలే వస్తున్నాయి. ఆమె భర్త తేజ.. నక్షత్రకు విడాకులు ఇవ్వకుండానే.. మరో మహిళను వివాహం చేసుకుని.. ఆమెతో కలిసి వేరుగా ఉంటున్నాడు. ఇక నక్షత్ర-తేజ దంపతులకు ఒక కుమార్తె ఉంది. బిడ్డకు తండ్రి ప్రేమ దూరం కాకూడదనే తపనతో.. భర్త తేజ చేసే దారుణాలను భరిస్తూ వస్తున్నాను అని చెప్పుకొచ్చింది నక్షత్ర. ఈ క్రమంలో తన భర్త మరో మహిళతో ఉండగా.. మీడియాతో అక్కడకు వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది నక్షత్ర. ఇదేంటని ప్రశ్నిస్తే.. తేజ.. ఆమెపై చేయి చేసుకున్నాడు. జుట్టు పట్టి బయటకు పంపించాడు. ఇక మీడియా వారు తేజ, అతడితో పాటు ఉన్న మహిళను వీడియో తీస్తుండగా.. తను నా భార్య.. వీడియో తీయోద్దంటూ తేజ వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో తేజతో ఉన్న యువతి ఎవరు.. ఆమెకు, అతడికి ఉన్న సంబంధం ఏంటి.. అనే వివరాలు మీ కోసం..

గతంలో మిస్‌ వైజాగ్‌ టైటిల్‌ గెలుచుకున్న నక్షత్రకు 2013లో ఓ సినిమా సమయంలో తేజతో పరిచయం అయ్యింది. అది కాస్త ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి.. 2017లో వీరు పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. ఆ తర్వాత నుంచి తేజ ప్రవర్తనలో మార్పు వచ్చింది. వేరే ఆడవాళ్లతో పరిచయాలు పెంచుకుని.. వారితో సంబంధాలు పెట్టుకునేవాడు. ఈవిషయమై తేజ, నక్షత్ర ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం తేజ.. నక్షత్రకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను వివాహం చేసుకున్నాడు.

ఇక తేజ రెండో పెళ్లి చేసుకున్న మహిళ పేరు ధర్మజ్ఞ అని తెలుస్తోంది. నక్షత్ర ఆరోపించిన దాని ప్రకారం.. ఆమె ఓ బడా రాజకీయ నాయకుడి బిడ్డ అని సమాచారం. తేజ గత కొన్నాళ్లుగా ధర్మజ్ఞతోనే కలిసి ఉంటున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం దస్పల్లా హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న నక్షత్ర మీడియాతో వెళ్లి.. తేజను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ప్రస్తుతం తేజ-నక్షత్రల విడాకుల కేసు కోర్టులో ఉంది. వీరిద్దరికి ఇంకా డైవోర్స్‌ మంజూరు కాలేదు. తనను ఇంతల మోసం చేసిన తేజ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నక్షత్ర డిమాండ్‌ చేస్తోంది.

నక్షత్ర ఆరోపణలు ఇలా ఉండగా.. తేజ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన వాదన వినిపిస్తున్నాడు. నక్షత్ర తన ఆఫీస్‌ వద్దకు వచ్చి గొడవ చేసిందని.. సినిమా ఆడిషన్స్‌ కోసం వచ్చిన యువతిపై ఆరోపణలు చేస్తోందని తెలిపాడు. ఈ వివాదం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి నక్షత్రను అడ్డుకున్నారు. తేజతో పాటు గదిలో ఉన్న ధర్మజ్ఞ అనే అమ్మాయిని అక్కడ నుంచి బయటకు పంపించి వేశారు. ఇక తన భార్య చేస్తోన్న ఆరోపణలన్ని నిరాధారమైనవే అంటున్నాడు తేజ. నక్షత్ర డబ్బులు ఇవ్వాల్సిందిగా తనను డిమాండ్‌ చేసిందని.. అందుకు తాను అంగీకరించకపోవడంతో.. ఇలాంటి ఆరోపణలు చేస్తుందని తెలిపాడు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş