Chiranjeevi
సరైన హిట్ పడాలి లేదా దర్శకుడికి విషయం వుందని తెలిసే సినిమా బయటకు రావాలి.
సరైన హిట్ పడాలి లేదా దర్శకుడికి విషయం వుందని తెలిసే సినిమా బయటకు రావాలి.
Chiranjeevi
సరైన హిట్ పడాలి లేదా దర్శకుడికి విషయం వుందని తెలిసే సినిమా బయటకు రావాలి. అప్పుడు ఆ డైరక్టర్ కు అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. మొదటి సినిమా వినరో బాగ్యము విష్ణు కథ కు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు అలియాస్ నందు కి అవకాశం బన్నీ వాస్ ఇచ్చారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కానీ దర్శకుడికి ఇంతో అంతో విషయం వుందని రెండో అవకాశాన్ని నిర్మాత సాహు గారపాటి ఇవ్వాలనుకున్నారు. రకరకాల ట్విస్ట్ లతో ఆ ప్రాజెక్ట్ అలా అలా అన్నపూర్ణ లోకి వెళ్లింది. లెనిన్ సినిమా బయటకు వచ్చింది.
ఇప్పుడు ఆ సినిమా మంచి హిట్ కావడం అన్న సంగతి పక్కన పెడితే సబ్జెక్ట్,టేకింగ్ మీద సినిమా జనాల దృష్టి పడింది. దాంతో హీరోల నుంచి ఎంక్వయిరీలు మొదలయ్యాయి. ఇక దర్శకుడిదే ఆలస్యం. సరైన కథ చెప్పి ఒప్పించగలిగితే చాలు అవకాశం చేతిలో పడుతుంది.
దర్ళకుడు నాని మంచి రైటింగ్ స్కిల్స్ వున్న దర్శకుల కోసం చూస్తారు. ఎందుకంటే స్క్రిప్ట్ వుండే డైరక్షన్ పెద్ద విషయం కాదు. నాని కి కూడా అందులో బోలెడు ప్రవేశం వుంది. అందుకే ఇప్పుడు నందు కు అవకాశం వచ్చింది. మంచి కథ వుంటే చెప్పమని నాని కోరినట్లు తెలుస్తోంది. ఇక నందు దే ఆలస్యం. తన కథతో నాని ని ఒప్పిస్తే మరో ఏడాదిలో సినిమా చేసేయచ్చు. ఈ లోగా నాని ఓ సినిమాను ఓజి సుజిత్ తో చేసి వస్తారు.