iDreamPost
android-app
ios-app

విశాఖ RK బీచ్ వద్ద వెనక్కు వెళ్లిన సముద్రం.. కారణం ఏంటంటే..?

Vizag RK Beach: విశాఖ పట్నంలో పర్యాటక ప్రాంతాల్లో ముందు గుర్తుకు వచ్చేది ఆర్కే బీచ్. ప్రతి రోజూ వేలాది మంది సందర్శకులు, పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. అయితే తాజాగా ఇక్కడ ఓ అద్భుత దృశ్యం కనిపించింది.

Vizag RK Beach: విశాఖ పట్నంలో పర్యాటక ప్రాంతాల్లో ముందు గుర్తుకు వచ్చేది ఆర్కే బీచ్. ప్రతి రోజూ వేలాది మంది సందర్శకులు, పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. అయితే తాజాగా ఇక్కడ ఓ అద్భుత దృశ్యం కనిపించింది.

విశాఖ RK బీచ్ వద్ద వెనక్కు వెళ్లిన సముద్రం.. కారణం ఏంటంటే..?

సాధారణంగా ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు అంటే భూకంపాలు, సునామీ వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు సముద్రం వెనక్కు వెళ్లడమో లేదంటే ముందుకు రావడమో జరుగుతూ ఉంటాయి. కానీ శనివారం సాయంత్రం విశాఖ పట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఆర్కే బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లింది. విశాఖ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్కే బీచ్. ప్రతి రోజూ వేలాది మంది సందర్శకులు, పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. అయితే తాజాగా ఇక్కడ ఓ అద్భుత దృశ్యం కనిపించింది. దాదాపు 400 మీటర్ల దూరం సముద్రంలోని నీళ్లు వెనక్కు వెళ్లాయి. ఒక్కసారిగా పర్యాటకులు షాక్ తిన్నారట. సముద్రం లోపలికి వెళ్లడంతో రాళ్లు, శిలలు బయటపడ్డాయి.

సముద్రంలోన నీరు మీటర్ల మేర వెనక్కు వెళ్లిందని తెలిసి ఈ వార్త దావనంలా వైజాగ్ మొత్తం నిమిషాల్లో వ్యాపించింది. ఈ వింతను చూసేందుకు క్యూ కట్టారట నగర వాసులు. అక్కడకు వెళ్లి ఫోటోలు, సెల్పీలు దిగి ఎంజాయ్ చేశారు. అయితే వైజాగ్ ఆర్కే బీచ్ వద్ద ఇలాంటి దృశ్యం కనిపించడం ఇదేమీ కొత్తకాదు అంటున్నారు స్థానికులు. గతంలో అంటే ఈ ఏడాది జనవరిలోనూ సముద్రం వెనక్కు వెళ్లింది. అయితే ఇలా సముద్రం వెనక్కు జరగడంపై నిపుణులు విశ్లేషించారు. చంద్రుడు, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్లే సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయని, అప్పుడు సముద్ర జల్లాల్లో పెరుగుదల, తగ్గుదల ఉంటుందని చెబుతున్నారు. అలాగే సముద్రంలో జరిగే అనేక పరిణామాల వల్ల కూడా ఇలాంటి పరిణామాలు ఏర్పడతాయని చెబుతున్నారు. దీని వల్ల సముద్రంలో నీరు వెనక్కు జరుగుతుందని అంటున్నారు.

సూర్యుడితో పోలిస్తే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి అధికంగా ఉంటుందని.. భూమికి దగ్గరగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. ఈ ఆటుపోట్లకు చంద్రుడని చెబుతున్నారు. వీటికి అలలు కూడా ఓ కారణమంటున్నారు. సముద్రం వెనక్కు వెళ్లడానికి మరో రీజన్ కూడా ఉంటున్నారు. సముద్రం ఉపరితలంపై నీటికణం పైకి చేరినప్పుడు కాస్త నెమ్మదించిన సమయంలో గురుత్వాకర్షణ శక్తి దానిని వెనక్కి లాగుతుంది. దీంతో పైకి వచ్చి నీటి కణం తిరిగి దాని అసలు స్థానానికి చేరుకుంటుంది. ఈ కారణంగానే సముద్రపు నీరు ఒడ్డుకు వచ్చి.. ఆ తర్వాత వెనక్కి నెట్టబడుతుందని మరికొంతమంది నిపుణులు చెప్తున్నారు. అయితే ఇలా సముద్రం వెనక్కు వెళుతున్నప్పుడు పర్యాటకులు కాస్త అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలలు వెంట పరిగెత్తడం చేయరాదని, సముద్ర తీర ప్రాంతాన్ని దూరం నుండే ఎంజాయ్ చేయాలని, దగ్గరకు వెళ్లకూడదని సూచిస్తున్నారు.