Chiranjeevi
టాలీవుడ్ సినిమాల నిర్మాణం మైత్రీ సంస్థకు ముందు తరువాత అనేది కాస్త పెద్ద స్టేట్ మెంట్ లా కనిపిస్తుంది కానీ…కొంత వరకు అది నిజం.
టాలీవుడ్ సినిమాల నిర్మాణం మైత్రీ సంస్థకు ముందు తరువాత అనేది కాస్త పెద్ద స్టేట్ మెంట్ లా కనిపిస్తుంది కానీ…కొంత వరకు అది నిజం.
Chiranjeevi
టాలీవుడ్ సినిమాల నిర్మాణం మైత్రీ సంస్థకు ముందు తరువాత అనేది కాస్త పెద్ద స్టేట్ మెంట్ లా కనిపిస్తుంది కానీ…కొంత వరకు అది నిజం. విత్తనాలు జల్లినట్లు పెద్ద అడ్వాన్స్ లు జల్లేసి ప్రశాంతంగా అమెరికాలో కూర్చున్నారు మైత్రీ నవీన్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ ఇలా అందరికీ. భారీ అడ్వాన్స్ లు, భారీ రెమ్యూనిరేషన్లు అన్నది అలవాటు చేసింది మైత్రీ సంస్థనే. ఏనాడు ఇచ్చిన ప్రభాస్ అడ్వాన్స్ ఇప్పటికి ఫౌజీగా మారింది. అలాగే ఎప్పటి అడ్వాన్స్ ఎప్పటికి ఉస్తాద్ సినిమాగా మారింది.
ఇలా నిర్మాణంలో సంచలనాలు నమోదు చేసి పంపిణీ రంగంలోకి వచ్చింది. నైజాంలో ఎవరు వచ్చినా నిలదొక్కుకోవడం కష్టంగా వుంది. దానికి బోలెడు కారణాలు వున్నాయి. కొందరి వ్యూహాత్మక బిజినెస్ గేమ్ కూడా దాని వెనుక వుంది. కానీ వాటిని తట్టుకుని పంపిణీ రంగంలో నిలబడ్డారు.
నైజాంలో పంపిణీ రంగంలో నిలబడాలి అంటే థియేటర్లు చేతిలో వుండాలి అన్న క్లారిటీ వచ్చింది. దాంతో థియేటర్ల సంఖ్య పెంచుకోవడం మొదలుపెట్టారు.
మైత్రీ పంపిణీ సంస్థ అంటే మైత్రీ అధినేతలది ఒక్కరిదే అనుకుంటారు. లేదా మైత్రీ శశి గుర్తుకువస్తారు. కానీ అది వాస్తవం కాదు. మైత్రీ పంపిణీ సంస్థలో పైకి కనిపించని భాగస్వాములు బోలెడు అంటే బోలెడు మంది వున్నారు. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, సీడెడ్ నాగార్జున ఇలా చాలా అంటే చాలా మంది. అందువల్ల పెట్టుబడికి సమస్య లేదు. రిస్క్ అందరికీ పంపిణీ అవుతుంది.
ఇప్పుడు మైత్రీ మరో అడుగు ముందుకు వేసి, తమ సినిమాలు కాని వాటికి పెట్టుబడి అందించి లాభాలు స్వీకరించే పని ప్రారంభించింది. త్వరలో విడుదల కాబోయే చెన్నై లవ్ స్టోరీ సినిమాలో మైత్రీ సంస్థ కు మెజారిటీ వాటా వుంది. సినిమా నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరించడం, లాభాల్లో వాటా తీసుకోవడం అనే కాన్సెప్ట్ అన్నమాట. ఇది క్లిక్ అయితే ఈ విధంగా కూడా ముందుకు వెళ్తారు.
మొత్తం మీద టాలీవుడ్ లో అతి పెద్ద సినిమా సంస్థగా మారే దిశగా మైత్రీ అడగు ముందుకు వేస్తోంది.