iDreamPost
android-app
ios-app

తమ్ముడిపై అభిమానం.. అక్క చేసిన పని చూస్తే కన్నీళ్లు ఆగవు!

  • Published Jul 22, 2024 | 3:23 PM Updated Updated Jul 22, 2024 | 3:23 PM

Visakhapatnam:భారత దేశంలో ఎన్నో సంప్రదాయలు, కట్టుబాట్లకు విలువనిస్తుంటారు. అలాంటి సంప్రదాయాల్లో ఒకటి పుష్పవతీ వేడుకలు. ఈ వేడుకలకు పుట్టింటి నుంచి మేనమామ చేతుల మీదుగా లాంఛనాలు ఇవ్వడం ఆనవాయితీ.. అలా ఇస్తే అంతా శుభం కలుగుతుందని నమ్మకం.

Visakhapatnam:భారత దేశంలో ఎన్నో సంప్రదాయలు, కట్టుబాట్లకు విలువనిస్తుంటారు. అలాంటి సంప్రదాయాల్లో ఒకటి పుష్పవతీ వేడుకలు. ఈ వేడుకలకు పుట్టింటి నుంచి మేనమామ చేతుల మీదుగా లాంఛనాలు ఇవ్వడం ఆనవాయితీ.. అలా ఇస్తే అంతా శుభం కలుగుతుందని నమ్మకం.

  • Published Jul 22, 2024 | 3:23 PMUpdated Jul 22, 2024 | 3:23 PM
తమ్ముడిపై అభిమానం.. అక్క చేసిన పని చూస్తే కన్నీళ్లు ఆగవు!

దేశంలోని ఇప్పటికీ హిందువులు ఎన్నో సనాతన ధర్మాలు, సంప్రదాయాలు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారికి జరిపించే పుష్పవతి, సీమంతం వేడుకలు ఎంతో ఘనంగా జరుపుతుంటారు. పుష్పవతి వేడుకలకు పుట్టింటి నుంచి లాంఛనాలు సమర్పించడం పూర్వ కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. పుట్టింటి నుంచి మేన మామ చేతుల మీదుగా లంఛనాలు అందిస్తే ఎంతో శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో సినిమాలు, సీరియల్స్ లో చూపిస్తూనే ఉంటారు. కాలం కలిసి రాక మేనమామ దూరమైతే.. ఆ కుటుంబం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి గరకపాలేనికి చెందిన పెంటకోట కిరణ్ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. 2020 లో అనుకోకుండా విద్యుత్ షాక్ కి గురై చనిపోయాడు. దాంతో కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డారు. చిన్నప్పటి నుంచి కిరణ్ అంటే ఆయన అక్క మాధవికి ఎంతో ప్రాణం.. ఇక మేన మామతో పిల్లకు ఎంతో అనుబంధం ఉండేది. ఈ క్రమంలోనే కిరణ్ అక్క మాధవి కూతురు లాస్య పుష్పవతి అయ్యింది. ఈ కార్యక్రమంలో మేన మామ లేని లోటు లేకుండా చేయాలని ప్లాన్ చేశారు. లాస్య పుష్పవతి వేడుకలు ఆదివారం అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడులో కిరణ్ సోదరి మాధవి చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

అనకాపల్లిలో జరిగిన వేడుకకు మాధవి తల్లిదండ్రులు పుట్టింటి నుంచి లాంచనాలు తీసుకు వచ్చారు. ఆ సమయంలో మాధవి తన తల్లిదండ్రులకు ఒక సర్పైజ్ ఇచ్చింది. తన కూతురుకి మేన మామ లేని లోటు లేకుండా చేశానని.. తమ్ముడి విగ్రహాన్ని తల్లిదండ్రులకు చూపించింది. దాంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పుట్టింటి నుంచి తెచ్చిన లాంఛనాలు మేనమామ చేతుల మీదుగా లాస్యకు అందించారు. తన తమ్ముడిపై ఉన్న ప్రేమను ఇంత గొప్పగా చాటుకున్నందుకు బంధువు, స్థానికులు మాధవిపై ప్రంశసలు కురిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom