iDreamPost
android-app
ios-app

విశాఖలో భారీ వర్షాలు.. కొండవాలు ప్రాంతాల్లోని ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు

  • Published Sep 09, 2024 | 12:47 PM Updated Updated Sep 09, 2024 | 12:47 PM

Visakhapatnam: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండవాలు ప్రాంతాల్లోని ఇళ్లకు పెను ముప్పు పొంచి ఉన్నది. స్థానికులు అధికారులను అలర్ట్ చేశారు.

Visakhapatnam: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండవాలు ప్రాంతాల్లోని ఇళ్లకు పెను ముప్పు పొంచి ఉన్నది. స్థానికులు అధికారులను అలర్ట్ చేశారు.

విశాఖలో భారీ వర్షాలు.. కొండవాలు ప్రాంతాల్లోని ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఏపీ మొత్తం అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. అల్పపీడనం కారణంగా వర్షాలు దంచికొట్టాయి. భారీగా కురిసిన వర్షాలతో వరదలు సంభవించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ముఖ్యంగ విజయవాడ నగరం వరద నీటిలో చిక్కుకుంది. కృష్ణా నది, బుడమేరు ఉదృతంగా ప్రవహించడంతో నగరం జలదిగ్భంధంలో చిక్కుకుంది. వందలాది మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇప్పుడిప్పుడే వర్షాలు, వరదల నుంచి తేరుకుంటున్న ఏపీ ప్రజలను మరో అల్పపీడనం వణికిస్తున్నది. దీని ప్రభావంతో విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండవాలు ప్రాంతాల్లోని ఇళ్లకు ప్రమాదం పొంచి ఉండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విశాఖలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొండవాలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. గోపాలపట్నం రామకృష్ణనగర్ కాళీమాత గుడి దారిలో విరిగిపడ్డ కొండచరియలు ఆ ప్రాంతవాసులను ఉలక్కిపడేలా చేశాయి. కొండవాలు ప్రాంతాల్లో ఇళ్లకు ముప్పు పొంచి ఉండటంతో స్థానిక శాసనసభ్యుడు గణబాబు అధికారులతో కలిసి పర్యటించి ఇళ్లలో నుంచి జనాన్ని ఖాళీ చేయించారు.

హనుమంత్వాక, ఎండాడ, తోటగురువు, మధురవాడ కొండవాలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయే స్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంతో వణికిపోతున్నారు. దీంతో కొండవాలు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. మొత్తం 80 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే వాయుగుండం ప్రభావంతో ఇవ్వాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరముంటేనే తప్పా.. బయటికి ఎవరూ రావొద్దని తెలిపారు. విజయవాడను బుడమేరు మరోసారి భయపెడుతోంది. అల్పపీడన ప్రభావంతో శని, ఆదివారాల్లో వర్షాలు కురవడంతో బుడమేరుకు వరద పోటెత్తింది. దీంతో బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.