iDreamPost

APకి మరో గుడ్ న్యూస్.. వైజాగ్ కి మరో దిగ్గజ ఐటీ కంపెనీ!

Capgemini: ఏపీ ప్రజలకు ఓ గుడ్ న్యూస్. ఓ ఐటీకీ కంపెనీ ఏపీకి రానుంది. ఇప్పటికే విశాఖ పట్నంలో పలు ఐటీ, ఫార్మ కంపెనీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా వైజాగ్ కి మరో దిగ్గజ ఐటీ కంపెనీ రానున్నట్లు సమాచారం.

Capgemini: ఏపీ ప్రజలకు ఓ గుడ్ న్యూస్. ఓ ఐటీకీ కంపెనీ ఏపీకి రానుంది. ఇప్పటికే విశాఖ పట్నంలో పలు ఐటీ, ఫార్మ కంపెనీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా వైజాగ్ కి మరో దిగ్గజ ఐటీ కంపెనీ రానున్నట్లు సమాచారం.

APకి మరో గుడ్ న్యూస్.. వైజాగ్ కి  మరో దిగ్గజ ఐటీ కంపెనీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా పరుగులు పెట్టించారు. రాష్ట్రాలంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాక అనేక ఐటీ, ఇతర కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షిస్తోన్నారు. ఇప్పటికే విశాఖ పట్నంలో పలు ఐటీ, ఫార్మ కంపెనీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా వైజాగ్ కి మరో దిగ్గజ ఐటీ కంపెనీ రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ కు ఐటీ రాజధానిగా విశాఖపట్నంకు గుర్తింపు ఉంది. ఇప్పటికే ఇక్కడికి అనేక ఐటీ కంపెనీలు వచ్చాయి. తాజాగా మరో దిగ్గజ కంపెనీ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనూ క్యాప్ జెమినీ వైజాగ్ రానున్నట్లు సమాచారం.  ఈ మేరకు కొందరు ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో పోస్ట్  చేశారు. క్యాప్‌జెమినీ ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో టచ్‌లో ఉందని.. వైజాగ్ కంపెనీ కొత్త డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి లోకేషన్ ఫైనల్ చేసే పనిలో ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే వర్క్ ప్లేస్ లోకేషన్‌పై క్యాప్‌జెమినీ సంస్థ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

విశాఖపట్నంలో ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఏర్పాటయ్యాయి. సాగరతీర నగరమైన విశాఖ నుంచి కార్యాకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా విశాఖలో ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి. కొన్ని కంపెనీలు విశాఖ పరిసరాల్లోని వివిధ ప్రాంతాల్లో తమ వర్క్ ప్లేస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అలానే దిగ్గజ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ కూడా అలాగే విశాఖలో ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా క్యాప్ జెమినీ రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి ఎలా కృషి చేస్తున్నాడు అనే దానికి ఇవి ఉదాహరణలు అని పలువురు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి