iDreamPost
android-app
ios-app

Yash’s Toxic: టాక్సిక్..భారీ సేఫ్ గేమ్!

  • Published Jul 20, 2026 | 11:02 AM Updated Updated Jul 20, 2026 | 11:02 AM

కేవిఎన్ సంస్థ హీరో యష్ నిర్మించిన భారీ సినిమా టాక్సిక్.

కేవిఎన్ సంస్థ హీరో యష్ నిర్మించిన భారీ సినిమా టాక్సిక్.

Yash’s Toxic: టాక్సిక్..భారీ సేఫ్ గేమ్!

కేవిఎన్ సంస్థ హీరో యష్ నిర్మించిన భారీ సినిమా టాక్సిక్. చాలా ఆలస్యం అయింది ఇప్పటికే. ఈ సినిమాను భారీగా ఆగస్ట్ నెలాఖరులో విడుదల చేయబోతున్నారు. భారీ సినిమా..భారీగా విడుదల..అంటే భారీగా రేటు వుంటుంది కదా. కానీ నిర్మాతలు అలా ఆలోచించడం లేదు. తమ భారీ సినిమా భారీగా విడుదల కావాలంటే తామే కొంత రిస్క్ చేయాలని డిసైడ్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వంత విడుదల చేయబోతున్నారు.

నిజానికి నిర్మాతలు తమ గత సినిమాల విషయంలో కూడా ఇదే పద్దతిలో వెళ్లారు. అడ్వాన్స్ లు తీసుకుంటారు. భారీగా విడుదల చేయిస్తారు. డబ్బులు రాకపోతే వెంటనే రిటర్న్ ఇస్తారు. ఇంత ఈజీ డీల్ కనుక చాలా మంది ముందుకు వస్తారు పంపిణీ చేయడానికి. అందుకే పెద్దగా కమిషన్ కూడా ఇవ్వరు. జస్ట్ ఏడు శాతం కమిషన్ మీద పంపిణీకి ఇస్తారు. అది కూడా అడ్వాన్స్ లు లేకుంటే. అడ్వాన్స్ లు వుంటే కమిషన్ కొంచెం పెంచుతారు. ఏదైనా సరే, పంపిణీ దారుకు రిస్క్ వుండదు.

నిజానికి నిర్మాతలు ఇలా ధైర్యం చేయడం చాలా తక్కువ. కానీ కెవిఎన్ సంస్థకు మాత్రం ఇదే అలవాటు. టాక్సిక్ సినిమాను దిల్ రాజు రెండు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు. కేవిఎన్ సంస్థకు ఈసారి కాస్త భారీగానే అడ్వాన్స్ లు పంపాల్సి వుంది కనుక. ఆ మేరకు కాస్త గట్టి రేట్లు చెబుతున్నారు. కానీ అంత రేట్లు పెట్టాలంటే ఎవరు ముందుకు వస్తారు జిల్లాల్లో అన్నది పాయింట్. అందుకే విశాఖ, ఈస్ట్, నెల్లూరు, నైజాం ల్లో దిల్ రాజే ఓన్ గా విడుదల చేయబోతున్నారు.

టాక్సిక్ కన్నా ముందు ఈవారమే కెవిఎన్ సంస్థ నుంచి జననాయగన్ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetcratosroyalbetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetantikbet girişEscortes BelgiqueHoliganbetGrandpashabetJOJOBET GİRİŞLERİcasibomHoliganbetCasibom Giriş