iDreamPost
android-app
ios-app

Nani’s Paradise: పారడైజ్ కు అదొక్కటే సమస్య!

నాని ‘ది పారడైజ్’ షూటింగ్ దాదాపు పూర్తయిందట. ఐదారు రోజుల టాకీ, రెండు పాటలు మాత్రమే మిగిలినా.. రిలీజ్ డేట్ విషయంలో టీమ్‌ను టెన్షన్ పెడుతున్న అసలు సమస్య మాత్రం CG వర్క్ అని తెలుస్తోంది.

నాని ‘ది పారడైజ్’ షూటింగ్ దాదాపు పూర్తయిందట. ఐదారు రోజుల టాకీ, రెండు పాటలు మాత్రమే మిగిలినా.. రిలీజ్ డేట్ విషయంలో టీమ్‌ను టెన్షన్ పెడుతున్న అసలు సమస్య మాత్రం CG వర్క్ అని తెలుస్తోంది.

Nani’s Paradise: పారడైజ్ కు అదొక్కటే సమస్య!

వాయిదాల పర్వం తరువాత హీరో నాని పారడైజ్ సినిమా లేటెస్ట్ విడుదల డేట్ ను ఎలాగైనా అందుకోవాలని టీమ్ కిందా మీదా కష్టపడుతోంది. రెండు యూనిట్ లు వర్క్ చేస్తున్నాయి. ఒక యూనిట్ హీరో లేని సీన్లు అన్నీ తీస్తుంటే మరో యూనిట్ హీరో వున్న సీన్లు తీస్తోంది. హీరో వున్న సీన్లు తీసే యూనిట్ ను డైరక్టర్ శ్రీకాంత్ ఓదెల చూసుకుంటున్నారు. రెండో యూనిట్ ను సీనియర్ కో డైరక్టర్ చూసుకుంటున్నారు.

లేటెస్ట్ సమాచారం ప్రకారం పారడైజ్ వర్క్ దాదాపు పూర్తయిపోయింది. జస్ట్ అయిదారు రోజుల టాకీ, రెండు పాటలు మాత్రం బకాయి వున్నాయి. వీటిలో ఒకటి స్పెషల్ సాంగ్. ఈ సాంగ్ కు ఎవరిని తీసుకోవాలి అన్నది ఫస్ట్ పాయింట్. పూజా హెగ్డే అన్నది ఓ ఛాయిస్. కానీ పూజా ప్రస్తుతం అమెరికా టూర్ లో వున్నారు. ఆమె వచ్చిన తరువాత షూట్ చేయడమా? అలా చేస్తే టైమ్ సరిపోతుందా అన్న డిస్కషన్లు జరుగుతున్నాయి. లేదా బాలీవుడ్ నుంచి ఎవరైనా కొత్త ఫేస్ ను తీసుకువద్దామా అనే ఆలోచన కూడా వుంది.

మొత్తం మీద షూటింగ్ ఆలస్యం అవుతుందన్న సమస్య లేదు. కానీ మరో సమస్య వుంది. సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామా. అందువల్ల భారీ సెట్ లు ఎంత వేసినా సి జి వర్క్ చాలానే వుంటుంది. ఇటీవలే భారీ క్లయిమాక్స్ వర్క్ ఫినిష్ చేసి సిజి కి పంపారు. అది పూర్తయి రావాలి. సిజి వర్క్ లు అంటేనే భయం. ఇన్ టైమ్ లో రావాలి. క్వాలిటీతో రావాలి. కరెక్షన్లు వుండకూడదు. అక్కడే పారడైజ్ టీమ్ కాస్త టెన్షన్ పడుతోంది.

పారడైజ్ సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి. ఫస్ట్ సాంగ్ భయంకరంగా వైరల్ అయింది. మంచి బిజినెస్ జరుగుతుంది. అందులో సందేహం లేదు. ఈసారి అయినా డేట్ మిస్ కాకుండా విడుదలయితే చాలు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş