iDreamPost
android-app
ios-app

Nani’s Paradise Nizam Deal: పారడైజ్ నైజాం డీల్ వెనుక..!

  • Published Jul 18, 2026 | 11:07 AM Updated Updated Jul 18, 2026 | 11:07 AM

హీరో నాని పారడైజ్ సినిమాకు సంబంధించి దాదాపు ముఫై అయిదు కోట్లు దాటిన డీల్?

హీరో నాని పారడైజ్ సినిమాకు సంబంధించి దాదాపు ముఫై అయిదు కోట్లు దాటిన డీల్?

Nani’s Paradise Nizam Deal: పారడైజ్ నైజాం డీల్ వెనుక..!

హీరో నాని పారడైజ్ సినిమాకు సంబంధించి దాదాపు ముఫై అయిదు కోట్లు దాటిన డీల్ వార్త నిన్న సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. 37.5 కోట్లకు ఆ సినిమా నైజాం హక్కులు మైత్రీ మూవీస్ దక్కించుకుంది అన్నది సోషల్ మీడియా సమాచారం. అసలు ఈ డీల్ ఏంటి? దీని వెనుక కథేంటీ?

పారడైజ్ సినిమా నైజాం హక్కులు తీసుకోవాలని నైజాంలో వన్ ఆఫ్ ది బిగ్ ప్లేయర్స్ అయిన ఆసియన్ సునీల్ అనుకున్నారు. పైగా ఆయనకు చిన్న అవకాశం కూడా వుంది. అదేంటీ అంటే పారడైజ్ నిర్మాత చెరుకూరి సుధాకర్ తో ఆర్థిక లావాదేవీలు వున్నాయి. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఆసియన్ సునీల్ సినిమాలు కొనరు. ఎంతయినా ఇస్తారు. కానీ అడ్వాన్స్ మీదే విడుదల చేస్తా అంటారు. ఇంత క్రేజీ ప్రాజెక్ట్ ను ఎవరైనా ఎందుకు అడ్వాన్స్ మీద ఇస్తారు.

నైజాంలో మరో కింగ్ పిన్ ఎస్వీసీ సంస్థ. ఆ సంస్థ 35 కోట్ల వరకు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ మీద ఆఫర్ ఇచ్చింది. కానీ అంతకన్నా మంచి డీల్ కోసం నిర్మాత సుధాకర్ చెరుకూరి ట్రయ్ చేసారు. మైత్రీ సంస్థ తో డిస్కషన్లు జరిగాయి. టాలీవుడ్ లోని ఓ సెలబ్రిటీ యువ నిర్మాత ఇక్కడ కీలకపాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఆఖరికి 36 కోట్లు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ దగ్గర డీల్ సెట్ అయింది. అయితే జస్ట్ కోటి రూపాయలకే డీల్ ఎస్వీసీ నుంచి మైత్రీకి వెళ్లిందా? అంటే కాదనే చెప్పాలి. ఆ మాత్రం కోటి కావాలి అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర ఎస్వీసీ కూడా ఓకె అనేదే.

కానీ మైత్రీ నుంచి ఈ అదనపు కోటి తో పాటు మరో ఆఫర్ కూడా వుందని తెలుస్తోంది. అదేంటీ అంటే లాభాల్లో పాతిక శాతం వాటా ను నిర్మాత సుధాకర్ కు ఇస్తారు. అంటే 36 కోట్లు ప్లస్ ఖర్చులు వచ్చేసిన తరువాత మిగిలే ఓవర్ ఫ్లోస్ నుంచి కమిషన్ కట్ చేస్తారు కదా. ఆ కమిషన్ లో నిర్మాతకు పాతిక శాతం వాటా ఇస్తారన్నమాట. సూపర్ డీల్ కదా. ఇదిలా వుంటే ఈ ముఫై ఆరు కోట్లలో ఆ యువ నిర్మాత కూడా పావలా వాటా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఆయన వంతు రిస్క్ 9 కోట్లు అన్నమాట.

మొత్తం మీద నైజాంలో డిస్ట్రిబ్యూషన్ పరంగా సినిమాలకు మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetador girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom