iDreamPost
android-app
ios-app

రైల్వే ప్రయాణికులు అలెర్ట్..ఆ బోగీల్లో ఎక్కితే కేసు నమోదు!

AP Railway Passengers Alert: ఏపీలో రైలు ప్రయాణికులకు రైల్వే పోలీసులు ఓ హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా రైళ్లోని ఆ బోగీల్లో ప్రయాణం చేస్తే కేసు నమోదు చేస్తున్నారు. పొరపాటున కూడా ఆ బోగిల్లో ఎక్కడ వద్దని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఏమిటంటే..

AP Railway Passengers Alert: ఏపీలో రైలు ప్రయాణికులకు రైల్వే పోలీసులు ఓ హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా రైళ్లోని ఆ బోగీల్లో ప్రయాణం చేస్తే కేసు నమోదు చేస్తున్నారు. పొరపాటున కూడా ఆ బోగిల్లో ఎక్కడ వద్దని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఏమిటంటే..

రైల్వే ప్రయాణికులు అలెర్ట్..ఆ బోగీల్లో ఎక్కితే కేసు నమోదు!

నిత్యం వేలాది మంది రైళ్లోలో ప్రయాణిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇక ప్రత్యేకం సందర్భాల్లో అయితే రైళ్లు కిటకిటలాడుతుంటాయి. జనరల్ బోగీలు నిండి, రిజర్వేషన్ బోగీల్లో సైతం ప్రయాణికులు వెళ్తుంటారు. మరికొన్నిసార్లు మహిళలకు, దివ్యాంగులకు కేటాయించిన బోగీల్లోకి కూడా వెళ్తుంటారు. తమ ప్రయాణాలను వాయిదా వేసుకోలేక.. రద్దీని తట్టుకుని ఏదో ఒక బోగీలో ఎక్కి ప్రయాణాలు చేస్తుంటారు. అయితే  ఏపీలో రైల్వే ప్రయాణికులు మాత్రం ఓ కీలక హెచ్చరిక వచ్చింది. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే..కేసులు నమోదు చేస్తామని రైల్వే పోలీసులు తెలిపారు.

ఏపీలో రైలు ప్రయాణికులకు రైల్వే పోలీసులు ఓ హెచ్చరిక జారీ చేశారు. రైళ్లలో దివ్యాంగులు, మహిళలకు కేటాయించిన బోగీల్లో ఇతర ప్యాసింజర్లు ఎక్కితే కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. శుక్రవారం విశాఖ రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేసిన ఆర్పీఎఫ్‌ పోలీసులు ఈ చర్యలు ప్రారంభించారు. నిబంధనలకు విరుద్దంగా దివ్యాంగులు, మహిళల బోగీల్లోకి ఎక్కిన దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని రైల్వే పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కొందరు ప్రయాణికులు దివ్యాంగులు, మహిళల బోగీల్లో ఎక్కుతున్నారని, ఆ బోగీల్లోకి ఇతర ప్రయాణికులు ఎక్కడం నేరమని ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తు చేస్తున్నారు. కొందరు విధిలేని పరిస్థితుల్లో ఆ బోగీలను ఎక్కుతున్నారని, అందుకే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా తమ జర్నీ సమయంలో రైళ్లలో ఖాళీ లేకపోతే మరో రోజుకు వాయిదా వేసుకోవాలని తెలిపారు. అంతేకాని దివ్యాంగులు, మహిళలకు ఇబ్బంది కలిగించేలా జర్నీ చేయొద్దని పోలీసలులు సూచిస్తున్నారు. శుక్రవారం విశాఖ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్న వారికి ఆర్పీఎఫ్‌ పోలీసులు అవగాహన కల్పించారు.  అంతటితో ఆగకుండా వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం స్టేషన్‌ బెయిల్‌పై వారందరిని విడుదల చేశారు.

ఇలా అదుపులోకి తీసుకున్న వారు ఎక్కాల్సిన ట్రైన్స్ అప్పటికే వెళ్లిపోవడంతో కొంతమంది తినడానికి తిండే లేక చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడ్డారు. వారందరికీ ఆర్పీఎఫ్‌ పోలీసులు ఆహారం అందజేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఎక్కువమంది జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నవారే ఉన్నారు. తాము ఎక్కడ ఖాళీ లేకపోవడంతో తప్ప వెళ్లాల్సిన పరిస్థితిలో ఆ బోగీల్లో ఎక్కుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఏపీలో రైళ్లలో ప్రయాణించే వారు ఇకపై జాగ్రత్తగా ఉండండి. పొరపాటున దివ్యాగులు, మహిళలో బోగీల్లో ఎక్కితే ఇక మీపై కేసు నమోదు చేయండం గ్యారెటీ. మరి.. ఆర్పీఎఫ్ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.