iDreamPost
android-app
ios-app

Tollywood Movies: రెండు సినిమాలకు ఏమిటి తేడా?

టాప్ రేంజ్ సీనియర్ నటుడు..పేరున్న దర్శకుడు.. పేరున్న బ్యానర్. నాన్ థియేటర్ చాలా కష్టం అయింది.

టాప్ రేంజ్ సీనియర్ నటుడు..పేరున్న దర్శకుడు.. పేరున్న బ్యానర్. నాన్ థియేటర్ చాలా కష్టం అయింది.

Tollywood Movies: రెండు సినిమాలకు ఏమిటి తేడా?

టాప్ రేంజ్ సీనియర్ నటుడు..పేరున్న దర్శకుడు.. పేరున్న బ్యానర్. నాన్ థియేటర్ చాలా కష్టం అయింది. ఆఖరికి 65 కోట్ల మేరకు లాగ గలిగారు. మళ్లీ అదే బ్యానర్..అదే డైరక్టర్..హీరో మారారు. ఈసారి ఈజీగా నాన్ థియేటర్ అయిపోయింది. పైగా 80 కోట్ల మేరకు. ఏమిటి తేడా? అంటే ముందు సినిమా పెద్ద హిట్ అయింది. అందుకే ఈసారి అమౌంట్ ఎక్కువ వచ్చింది..ఈజీగా పనయింది అని అనేయచ్చు. కానీ నిజానికి గత సినిమాకు ముందు వచ్చిన సినిమాలు కూడా హిట్ లే..మరి ఎందుకు వర్కవుట్ కాలేదు అప్పుడు..అంటే సమాధానం అంత ఈజీ కాదు.

సినిమా జనాల లెక్కలకు, సోషల్ మీడియా లెక్కలకు, కార్పొరేట్ లెక్కలకు మధ్య చాలా తేడా వుంటుంది. సినిమా జనాల లెక్కలు అన్నీ కల్పిత ప్రచారానికి లోబడి వుంటాయి. ఆ కల్పిత ప్రచారం అంటే సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. అవన్నీ చూపించి హీరోలు గట్టిగా రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తారు. ఆ మేరకు ఓటిటి నుంచి మాగ్జిమమ్ రాబట్టాలని చూస్తారు.

కానీ కార్పొరేట్ లెక్కలు రియలిస్టిక్ గా వుంటాయి. వాళ్లకి గ్రవుండ్ రియాల్టీ తెలుసు. జనాలు ఏం చూస్తారో, ఏ కాంబినేషన్ చూస్తారో, ఏ హీరో మార్కెట్ అంతో వాళ్లకి ఫింగర్ టిప్స్ మీద వుంటాయి. అందుకే దాన్ని బట్టి వాళ్లు తమ రేటు కోట్ చేస్తారు.

ఇప్పుడిప్పుడే ఈ వాస్తవం నిర్మాతలకు కూడా తెలిసి వస్తోంది. అందుకే అలాంటి ఇన్ ఫ్లేషన్ రేట్లు వున్న హీరోలతో సినిమాలు తీయాలి. దానికి వందల కోట్లు పెట్టాలి అంటే కాస్త ముందు వెనుకలు ఆడుతున్నారు. మొహమాటపడుతూనే, బడ్జెట్ వర్కవుట్ కాదు అని మెల్లగా చెప్పి, పక్కకు తప్పుకుంటున్నారు. ఆ మధ్య ఓ ప్రాజెక్ట్ ఇలాగే ఇద్దరు ముగ్గురు టాలీవుడ్ నిర్మాతల దగ్గరకు వెళ్లింది..వాళ్లు స్మూత్ గా ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నారు. ఆఖరికి మరో బ్యానర్ ఫిక్స్ అయింది.

ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కనుక బడ్జెట్..అమ్మకాలు..లాభాలు వర్కవుట్ అయితే మళ్లీ నిర్మాతలు కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్తారేమో?

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom