Chiranjeevi
షూటింగ్‌లో గాయం.. ఆపై ఆపరేషన్. అయినా సినిమా రిలీజ్ ప్లాన్ మారకూడదంటున్నారట బాలయ్య. తాను తిరిగి సెట్స్‌లోకి వచ్చేలోపు చేయాల్సిన పనులపై కూడా టీమ్‌కు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.
షూటింగ్‌లో గాయం.. ఆపై ఆపరేషన్. అయినా సినిమా రిలీజ్ ప్లాన్ మారకూడదంటున్నారట బాలయ్య. తాను తిరిగి సెట్స్‌లోకి వచ్చేలోపు చేయాల్సిన పనులపై కూడా టీమ్‌కు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.
Chiranjeevi
హీరోలు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వుంటారు. అవసరం అయితే ఆరు నెలలు విశ్రాంతి తీసుకుంటారు. కానీ నందమూరి బాలయ్య సంగతి వేరు. ఆయనకు షూటింగ్ లో గాయం అయింది. హైదరాబాద్ లో ఆపరేషన్ అయింది. అయినా వెనక్కు తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా డిసెంబర్ మూడోవారం లో రావాల్సిందే అని టీమ్ కు చెప్పేసారట.
తాను ఎన్ని రోజులు విశ్రాంతిలో వుంటాను, ఎప్పటి నుంచి షూటింగ్ కు వస్తాను, అప్పటి నుంచి ఇంక ఎన్ని రోజులు టైమ్ వుంటుంది ఇవన్నీ డిస్కషన్ చేసేసారట. తను వచ్చే లోపు, తనతో అవసరం లేని సీన్లు అన్నీ ఫినిష్ చేసేయమని హుకుం జారీ చేసేసారట. ఆ విధంగా సినిమాకు ఆటంకం కలగకుండా ఇన్ టైమ్ లో విడుదలకు ప్లానింగ్ బాలయ్యే చేసేసారు.
నిజానికి ఇప్పుడు అంత అర్జంట్ గా బాలయ్య షూటింగ్ చేయకపోయినా అడిగేవారు లేరు. మహా అయితే జనవరిలోనో, ఫిబ్రవరిలోనో విడుదల చేసుకోవచ్చు. కానీ మొండి మనిషి కదా, ప్లానింగ్ మారడానికి వీలు లేదని చెప్పేసారట యూనిట్ కు. తెల్లవారుఝామున మూడు గంటలకు లేచి యోగా, పూజలు చేసే అలవాటున్న మనిషి. ఈ గాయాలు, ఆపరేషన్లు ఆయన్ను ఆపగలవా?