iDreamPost
android-app
ios-app

Nagarjuna: నాగ్ చెప్పింది వాస్తవమే కానీ..!

హాలీవుడ్ సినిమాలు ఎంత భారీగా తీసినా, ఏడాది ముందు డేట్ వేస్తే ఆ డేట్ కు వస్తున్నాయి. మనకు ఎందుకు అలా కావడం లేదు.

హాలీవుడ్ సినిమాలు ఎంత భారీగా తీసినా, ఏడాది ముందు డేట్ వేస్తే ఆ డేట్ కు వస్తున్నాయి. మనకు ఎందుకు అలా కావడం లేదు.

Nagarjuna: నాగ్ చెప్పింది వాస్తవమే కానీ..!

హాలీవుడ్ సినిమాలు ఎంత భారీగా తీసినా, ఏడాది ముందు డేట్ వేస్తే ఆ డేట్ కు వస్తున్నాయి. మనకు ఎందుకు అలా కావడం లేదు. టెక్నీషియన్లు ఆలోచించాలి అన్నారు హీరో నాగార్జున. ఆయన హీరో్ మాత్రమే కాదు. నిర్మాత, స్టూడియో ఓనర్ కూడా. ముందుగా ఆయన ఆలోచించాల్సింది. ఆయన స్టూడియోలో వర్క్ లు అన్నీ అనుకున్న ప్రకారం డేట్ కు కస్టమర్లకు పూర్తి చేసి ఇస్తున్నాయా? లేదా అన్నది. ఎందుకంటే ఎన్నో సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతూ వుంటుంది. అక్కడ డెడ్ లైన్ మీట్ అయ్యేలా చూడడం నాగార్జున బాధ్యతే.

తరువాత ముచ్చట ఏమిటంటే టెక్నీషియన్లు అంతా ఒకటికి పది సినిమాల మీద బిజీ కావడం. ముఖ్యంగా సంగీతం దర్శకులు రీ రికార్డింగ్, మిక్సింగ్ అన్నది చాలా టైమ్ తీసుకుంటుంది. టెక్నీషియన్ల తీరు ఎలా వుంటుంది అంటే ఎప్పటికప్పుడు సినిమా ఎలా జరుగుతోంది అన్నది చూస్తూ వుంటారు. సినిమా మిగిలిన వర్క్ ఆలస్యం అవుతున్నట్లు కనిపిస్తే, వీళ్లూ తమ వర్క్ పక్కన పెట్టి, వేరే సినిమాల మీదకు వెళ్లిపోతారు. కచ్చితంగా విడుదల డేట్ కు రావాల్సిందే అన్నపుడు మాత్రం వర్క్ మొదలుపెడతారు. అంతే కాదు. పెద్ద నిర్మాత, దర్శకుడు, హీరో అంటే టెక్నీషియన్ల డెడ్ లైన్ మీట్ కావడం ఒకలా వుంటుంది. లేదంటే మరోలా వుంటుంది.

పెద్ద టెక్నీషియన్ అయితే డెడ్ లైన్ నిర్మాత, దర్శకుల చేతిలో వుండదు. అక్కడ టెక్నీషియన్ దే పైచేయి. తను ఎప్పుడు ఫినిష్ చేసి ఇస్తే అప్పుడే తీసుకోవాలి. ఇక్కడ గొడవ పడడానికి కూడా నిర్మాత, దర్శకులు అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే గొడవ పడితే అవుట్ పుట్ మీద ప్రభావం పడిపోతుందనే భయం.

ఇంక అసలు సిసలు మరో కారణం హీరోలు. వాళ్లకి ఏమాత్రం ఇబ్బందిగా వున్నా షూటింగ్ క్యాన్సిల్.పెద్ద హీరోలు షూటింగ్ క్యాన్సిల్ కొట్టే రోజుల లెక్క అస్సలు బయటకు రాదు. హీరోలు క్యాన్సిల్ కొడితే రోజుకు లక్షల్లో నష్టం అన్న సంగతి పక్కన పెడితే, కాంబినేషన్ నటుల డేట్ లు దొరకడం అతి పెద్ద సమస్య. నిర్మాత కిందా మీదా పడి మళ్లీ డేట్ లు సెట్ చేసుకోవాలి. దానికి టైమ్ పడుతుంది. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాల్లో వుండే నటులు కూడా పెద్ద వాళ్లే వుంటారు. వాళ్లు కూడా బోలెడు బిజీగా వుంటారు. ఒక్కసారి డేట్ లు వదిలేసుకుంటే మళ్లీ దొరకడం అంత సులువు కాదు.

మరో సమస్య ఏమిటంటే ఫుటేజ్. దర్శకులు మూడు గంటల సినిమాకు నాలుగు నుంచి అయిదు గంటల ఫుటేజ్ తీస్తారు. దాన్ని కుదించి, కుదించి ఓ కొలిక్కి తేవాలంటే అంత సులువు కాదు. అదీ కాక బౌండ్ స్క్రిప్ట్ అన్నది పేరుకే. షెడ్యూలు షెడ్యూలుకీ స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతూనే వుంటాయి. ఇలా ప్రతి క్రాఫ్ట్ దగ్గర సమస్యలు వున్నాయి. ఇవన్నీ మారితేనే విడుదల డేట్ కు అనుకున్నట్లు సినిమా రెడీ అవుతుంది. లేదంటే ఇలాగే వాయిదాల పర్వం కొనసాగుతూ వుంటుంది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş