పబ్ కు ఎవరైనా ఎందుకు వెళ్తారు?? స్నేహితులతో ఛిల్ అవ్వడానికి. అయితే ఇక్కడే చాలామంది కాస్త హద్దులు దాటి శృతిమించిపోతున్నారు. కొందరు తప్పతాగి స్పృహ లేకుండా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు మాత్రం విచిత్రంగా పబ్ సిబ్బందితోనే గొడవ పడుతున్నారు. తాజాగా ఇద్దరు యువతులు ఒక పబ్ సిబ్బందిపై దాడి చేయడం వైరల్ గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవూలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాగిన మత్తులో ఇద్దరు యువతులు పబ్బులో యువకుడిపై దాడికి […]
హైవే రోడ్డు మీద ట్రాఫిక్. రోడ్డును దాటడానికి పులి వెయిట్ చేస్తోంది. అందుకే ట్రాఫిక్ పోలీస్ కార్లు, బైక్ లను ఆపేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ట్రాఫిక్ పోలీసు అడవి పులిని రోడ్డు దాటడానికి వీలుగా, హైవే సిగ్నల్ వద్ద ట్రాఫిక్ ను కాసేపు ఆపేశాడు. ట్విట్టర్లో ఫారెస్ట్ ఆఫీసర్ (IFS) పర్వీన్ కస్వాన్ ఈ వీడియో షేర్ చేశాడు. “పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్. ఈ అందమైన వ్యక్తులు. తెలియని ప్రదేశం” […]
కర్నాటకలో ముద్దుల పోటీ సంచలనమైంది. మంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థులు కిస్సింగ్ గేమ్(Liplock game) ఆడారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకర్ని ఒకరు కిస్ చేసుకున్నారు. దీనికి ఫ్రెండ్స్ చీర్ చేస్తున్నారు. ఇందులో ఒక కండీషన్ కూడా ఉందంట. ముద్దులే ఇవ్వాలి, ఫ్రెంచ్ కిస్ వద్దంటూ ఒక కుర్రాడు చెబుతున్నాడుకూడా. ఓ ప్రముఖ కాలేజీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. వీరిలో 17 ఏళ్ల కుర్రాడు, లైట్ […]
చందౌలీలోని రాయ్‌గఢ్ ప్రాథమిక పాఠశాలలో, టీచర్ శివేంద్ర సింగ్(Shivendra Singh ) ఇటీవలే మరో స్కూల్ కు బదిలీ అయ్యారు. పాఠశాలలో అతనికి ఘనంగా వీడ్కోలిచ్చారు. కాని, చివర్లో అతను స్కూల్ ను వదిలివెళ్తుంటే విద్యార్థులు తట్టుకోలేకపోయారు. అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేశారు. వద్దు సార్…వెళ్లొద్దు అంటూ అతన్ని పట్టుకున్నారు. సింగ్ పరిస్థితికూడా అలాగే ఉంది. కాని వెళ్లకతప్పదుకదా! నేను త్వరలో మళ్లీ వస్తా. కష్టపడి చదవమని వాళ్లను ఓదార్చాడు. కాని అతను కూడా భావోద్వేగానికి లోనైయ్యాడు. […]
పెంపుడు జంతువులకు మనుషులకు మధ్య బంధం ఎనలేనిది. నిజానికి మనుషుల పట్ల మనుషుల కంటే.. జంతువులకే ఎక్కువ ప్రేమ, విశ్వాసం ఉంటాయంటారు. మనుషులు కూడా వాటిపై ఎనలేని ప్రేమను పెంచుకుంటారు. తమ ఇంట్లో మనిషిలాగే ట్రీట్ చేస్తారు. తోడబుట్టిన తమ్ముడు, చెల్లెలు అన్నట్లుగా చూసుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది పెంపుడు జంతువుల పుట్టినరోజులు సెలబ్రేట్ చేస్తున్నారు. అలా కర్ణాటకలో ఓ వ్యక్తి తన ఇంట్లో కుక్క పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశాడు. బెళగావిలో ఉండే శివప్ప […]
బస్సు, రైలు లేదా మెట్రో రైలు ఇలా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఏదైనా సరే వృద్ధులు, చంటిబిడ్డల తల్లులకు సీటివ్వడం కనీస మర్యాదను చాటుతుంది. వాళ్లు నిల్చుని ఉంటారులే.. మనమెందుకు సీటివ్వాలని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటి అలవాట్లు, ఆలోచనలు సమాజానికి అంత మంచిది కాదు. తాజాగా.. ఓ మహిళ తన బిడ్డను ఒడిలో పెట్టుకుని మెట్రో రైలులో నేలపై కూర్చుని ఉన్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను […]
అమ్మలో “అ”.. నాన్న లో “న్న” తల్లిదండ్రుల్లో సగం అన్న అంటారు. అమ్మ నాన్నల తర్వాత తోబుట్టువుకు అన్నీ తానై చూడాల్సిన బాధ్యత అన్నకే ఉంటుంది. అందుకే తన చెల్లెలి పెళ్లిరోజున చెల్లెలి ముఖంలో సంతోషం చూడాలనుకున్న ఆ అన్న ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. పెళ్లిలో అన్నీ ఉన్నా.. అన్న అన్నీ తానై చూసుకున్నా ఇంకా ఏదో తెలియని లోటు కనిపించింది ఆ చెల్లెలికి. అదే తండ్రి లేని లోటు. చెల్లెలి ముఖంలో బాధని గమనించిన […]
డాక్టర్ నుంచి యాక్టర్ గా మారి.. తనకు వస్తున్న ఆఫర్లను, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తన నైజానికి తగ్గ పాత్రలను ఎంచుకుంటూ విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న నవతరం నటి సాయిపల్లవి. ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసేసిన సాయిపల్లవి – రానా జంటగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో 1990ల్లోని ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా విరాటపర్వం. జూన్ 17న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో […]
ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడమే కాకుండా పోలీసులపై విరుచుకుపడిందో యువతి. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసిన ఆ కారును పోలీసులు ఆపడంతో.. కారునే ఆపుతావా, నేనెవరో తెలుసా అంటూ ఆ పోలీస్ పై మండిపడింది. తప్పుచేయడమే కాకుండా.. ఆ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన ఆ యువతి.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ కూతురు కావడం గమనార్హం. బీఎండబ్ల్యూ కారును డ్రైవ్ చేస్తూ రోడ్డుపైకొచ్చింది. ఒక చోట రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా.. రయ్ మని […]
ఇది సినిమాటిక్ గా కనిపించే దొంగతనం. కాకపోతే అంతా ఒరిజినల్. చాలా రిస్కీ. రైలు నదిపై బ్రిడ్జ్ దాటుతోంది. ఇద్దరు కుర్రోళ్లు రైలు తలుపు దగ్గర కూర్చున్నారు. ఓ కుర్రాడి ఫోన్ చూస్తున్నాడు. అదికాస్తా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. మాయం. అలాగని ఫోన్ నదిలో పడిపోలేదు. బ్రిడ్జి మీదున్న ఓ దొంగ… రెప్పపాటులో వేగంగా వెళ్తున్న రైలులోని ఫోన్ కొట్టేశాడు. అతను బ్రిడ్జి రెయిలింగ్ మీదనున్నాడు. స్పైడర్ మ్యాన్‌లా వేలాడుతూ, ప్రయాణికుడి చేతిలోని ఫోన్ లాగేశాడు. అంతే […]