iDreamPost
android-app
ios-app

Video: ముగ్గురు దొంగలకి చుక్కలు చూపించిన సూపర్ ఉమన్.. ఏం చేసిందంటే?

  • Published Oct 03, 2024 | 1:46 PM Updated Updated Oct 03, 2024 | 1:46 PM

Punjab: కొందరు దొంగలు గోడ దూకి ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించారు. కానీ ఆ ఇంటి మహిళ డోర్‌కు అడ్డంగా నిలబడి ఆ దొంగలను లోపలకి రానివ్వకుండా చేసింది.

Punjab: కొందరు దొంగలు గోడ దూకి ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించారు. కానీ ఆ ఇంటి మహిళ డోర్‌కు అడ్డంగా నిలబడి ఆ దొంగలను లోపలకి రానివ్వకుండా చేసింది.

Video: ముగ్గురు దొంగలకి చుక్కలు చూపించిన సూపర్ ఉమన్.. ఏం చేసిందంటే?

మనిషికి అన్నిటి కంటే విలువైనది తన ప్రాణం. అలాంటి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే? ఇంకేమైనా ఉందా .. తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి మనిషి దీనికైనా తెగిస్తారు. అందులోనూ ముఖ్యంగా మహిళలు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తమ కుటుంబం కోసం ఎంత రిస్క్ అయిన తీసుకుంటారు. ఇక తమ పిల్లలకు ఆపద వస్తే దేనికి తగ్గరు. వారిని కాపాడుకోవడానికి తమ శక్తిని మించి పోరాడుతారు. ఇలా మనం గతంలో ఎన్నో ఘటనలు చూసుంటాం. తాజాగా మరోసారి అలాంటి ఘటన రుజువైంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈరోజుల్లో ఎక్కడ చూసినా దొంగల భయం ఎక్కువవుతుంది. రాత్రి, పగలు తేడా లేకుండా దోపిడీలకు పాల్పడుతున్నారు. అడ్డొచ్చిన వారిని అతి క్రూరంగా చంపేస్తున్నారు. తాజాగా పట్టపగలే కొందరు దొంగలు గోడ దూకి ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించారు. కానీ ఓ మహిళ డోర్‌కు అడ్డంగా నిలబడి ఆ దొంగలను లోపలకి రానివ్వకుండా విశ్వప్రయత్నాలు చేసింది. పూర్తి వివరాల్లోకి వెలితే..

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఈ ఘటన జరిగింది. ముగ్గురు దొంగలు గోడ దూకి ఓ ఇంటి లోపలికి చోరబడే ప్రయత్నం చేశారు. అయితే ఆ దొంగలు వచ్చారని ముందుగానే ఆ ఇంటి మహిళ పసిగట్టింది. పసిగట్టి భయపడి పారిపోవడానికి ప్రయత్నించలేదు. ఏదైతే అదయ్యింది తగ్గేదెలే అనుకుంది. వెంటనే అలెర్ట్ అయింది. ఆ దొంగలు లోపలికి రాకుండా డోర్‌కు అడ్డుగా నిలబడింది. ముగ్గురు దొంగలు తలుపును ఎంత తెరవాలని చూసిన వారి వల్ల కాలేదు. అంతలా ఆ మహిళ బలంగా తలుపుకు అడ్డంగా నిలబడింది. ఎలాగోలా డోర్‌ ని లాక్ చేసి ఒక్క చేతితో తలుపును అదిమి పట్టుకొని, మరో చేతితో సోఫాను లాగి దొంగలు రాకుండా తలుపుకు అడ్డంగా పెట్టింది. ఆ మహిళ ఇలా ఒంటరిగా పోరాడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. వారిని కాపాడేందుకు మహిళ ఇంత సాహసం చేసింది. తనను, తన పిల్లలను కాపాడుకుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసి నెటిజన్స్ రకరకలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ మహిళ పోరాటానికి ఫిదా అయిపోతున్నారు. శెభాష్ అంటున్నారు. తన ప్రాణాలకు తెగ్గించి ఫైట్ చేసిందని కామెంట్లు చేస్తున్నారు. ఆ ముగ్గురు దొంగలకు మహిళ పవర్ ఏంటో చూపించిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి మహిళ కుటుంబానికి ఒక్కరున్నా చాలు .. ఈవిడ నిజంగా సూపర్ ఉమన్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఆమె ధైర్యానికి మెచ్చి, ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ముగ్గురు దొంగలను ఎదుర్కొని తన పిల్లలని కాపాడుకున్న ఈ వీరనారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

jojobetjojobet girişJojobet Casino Sitesicasibomjojobetmarsbahis