iDreamPost
android-app
ios-app

వీడియో: టికెట్ తీసుకోకుండా రైలెక్కిన లాయరమ్మ.. TTE రాగానే

టికెట్ లేని ప్రయాణం నేరం.. కానీ ఓ లాయరమ్మ చట్టం తన చుట్టం అనుకుందేమో తెలియదు కానీ.. టికెట్టు తీసుకోకుండానే రైలు ఎక్కింది. సాధారణ కంపార్ట్ మెంట్ కాకుండా.. ఏకంగా..

టికెట్ లేని ప్రయాణం నేరం.. కానీ ఓ లాయరమ్మ చట్టం తన చుట్టం అనుకుందేమో తెలియదు కానీ.. టికెట్టు తీసుకోకుండానే రైలు ఎక్కింది. సాధారణ కంపార్ట్ మెంట్ కాకుండా.. ఏకంగా..

వీడియో:  టికెట్ తీసుకోకుండా రైలెక్కిన లాయరమ్మ.. TTE రాగానే

టికెట్ లేని ప్రయాణం నేరం. ఈ విషయం తెలిసి కూడా కొంత మంది టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కేస్తుంటారు. జనరల్ బోగీల్లో చాలా మంది ప్రయాణీకులు టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. టీటీఈ చెకింగ్‌కువస్తే.. కొంత మంది బాత్రూమ్‌లో దాక్కోవడం, లేకుండా బోగీలు మారుతూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక దొరికారా పెనాల్టీ కట్టాల్సిందే. సాధారణంగా జనరల్ భోగీల్లో పేదవాళ్లు, మధ్య తరగతి కుటుంబాలు ప్రయాణిస్తుంటారు. డబ్బులు లేకో,కాసులు మిగిల్చేయాలన్న కక్కుర్తి పడో టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కేస్తుంటారు. కానీ ఓ లేడీ లాయర్ మాత్రం.. చట్టం తన చుట్టం అనుకుందేమో తెలియదు కానీ ఏకంగా.. టికెట్ తీసుకోకుండా హై క్లాస్ పీపుల్ ప్రయాణించే కోచ్‌లో అది కూడా రిజర్వ్డ్ సీట్‌లో కూర్చుంది. చివరకు టీటీఈ టిక్కెట్ అడగ్గా తిరిగి ఆయనపై రివర్స్ అయ్యింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు మహిళా లాయర్ పై మండిపడుతున్నారు నెటిజన్లు. ఈ ఘటన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్‌లో రైలులో చోటుచేసుకుంది. ఓ లేడీ లాయర్ టికెట్ తీసుకోకుండా నేరుగా.. ఏసీ 2-టైర్ కోచ్‌లో ప్రయాణిస్తుంది. చెకింగ్ వెళ్లిన టీటీఈ ఆమెను టికెట్ అడగ్గా.. అతడిపై రివర్స్ అయ్యింది. టికెట్ చూపకుండా.. వాష్ రూం కంపు కొడుతుందని, ఆ సర్వీస్ బాగోలేదు, ఈ సర్వీస్ బాగోలేదు అంటూ అతడిపై ఫైర్ అయ్యింది. అయినప్పటికీ.. తమాయించుకున్న టీటీఈ డిజిటల్ వెరిఫికేషన్ కోసం మీ సీట్ నంబర్ చెప్పండి అనగానే రౌడీయిజం ప్రదర్శించింది. గుర్తు లేదు.. నేను చెప్పను అంటే అతడిపై విరుచుకుపడుతుంది. అతడిపై మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా పాల్పడింది. దీంతో టీటీఈ చివరకు పోలీసులకు ఫోన్ చేయక తప్పలేదు.

పోలీసులు వచ్చాక ఆమెను రైలు నుండి బయటకు తీసుకు వచ్చారు. అయినప్పటికీ ఆమె కోపం తగ్గలేదు. పోలీసులను పిలుస్తావా అంటూ టీటీఈపై వారి ఎదుటే దాడి చేసింది. లేడీ పోలీసులు ఏరీ.. మీరెందుకు వచ్చారంటూ మండిపడింది. కట్టలు తెంచుకున్న కోపాన్ని ప్రదర్శిస్తూ టికెట్ కలెక్టర్‌ను కొడుతూనే ఉంది. అతడి పట్ల క్రూయల్‌గా వ్యవహరిస్తూ తన ప్రతాపాన్ని చూపించింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో టికెట్ తీసుకోకుండా ఆమె ప్రవర్తించిన తీరు గుజుప్సాకరంగా ఉందని అంటున్నారు. లాయర్ వృత్తిలో ఉండి.. న్యాయాన్ని, ధర్మాన్ని పరిరక్షించాల్సిన న్యాయవాది ఇలా ప్రవర్తించడమేంటనీ, న్యాయ వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.