iDreamPost
android-app
ios-app

పెట్రోల్ పోసి OLA షోరూమ్ తగలబెట్టేసిన యువకుడు.. ఎందుకంటే?

Customer Set OLa Showroom Ablaze In Kalaburagi: ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసిన ఒక వినియోగదారుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. బండిలో సమస్యలు ఉన్నాయని చెప్పినా వినడం లేదు అని.. ఏకంగా షోరూమ్ నే తగలబెట్టేశాడు.

Customer Set OLa Showroom Ablaze In Kalaburagi: ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసిన ఒక వినియోగదారుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. బండిలో సమస్యలు ఉన్నాయని చెప్పినా వినడం లేదు అని.. ఏకంగా షోరూమ్ నే తగలబెట్టేశాడు.

పెట్రోల్ పోసి OLA షోరూమ్ తగలబెట్టేసిన యువకుడు.. ఎందుకంటే?

భారత్ లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ముఖ్యంగా టూవీలర్స్ లో ఈవీలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈవీలు కొనేందుకు కొందరు జంకుతూ ఉన్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఎక్కువ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది అని. అయితే కంపెనీలు వినియోగదారుల్లో నమ్మకం నింపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కస్టమర్స్ లో ధైర్యం నింపేందుకు కృషి చేస్తున్నాయి. కానీ, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం కంపెనీలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తూనే ఉంది. ఓలా బండి కొన్న ఒక వినియోగదారుడు కంపెనీ మీద కోపంతో ఊగిపోయాడు. పట్టరాని ఆగ్రహంతో పెట్రోల్ పోసి షోరూమ్ నే తగలబెట్టేశాడు. అతనికి అంత కోపం వచ్చేలా ఏం జరిగింది? ఎందుకు అతను అలా చేశాడో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటోంది కర్ణాటక రాష్ట్రం కలబర్గికి చెందిన 26 ఏళ్ల నదీమ్ అనే యువకుడి గురించి. అతను వృత్తి పరంగా మెకానిక్ గా చేస్తున్నాడు. నదీమ్ కలబుర్గిలోని ఓలా షోరూమ్ లో ఒక ఎలక్ట్రిక్ బండిని కొనుగోలు చేశాడు. సరిగ్గా నెల క్రితం రూ.1.4 లక్షలు పెట్టి ఓలా ఈవీని కొనుగోలు చేశాడు. అయితే కొన్న రెండ్రోజులకే బండిలో ఇబ్బందులు తలెత్తాయి. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ, సౌండ్ సిస్టమ్ విషయంలో సమస్యలు తలెత్తాయంట. ఆ విషయమై మాట్లాడేందుకు నదీమ్ కలబుర్గిలోని షోరూమ్ కి వెళ్లాడు. అలా ఒకసారి కాదు.. పదే పదే షోరూమ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడంట. తన బండిని బాగుచేయమని ఎన్నిసార్లు అడిగినా కూడా సిబ్బంది సరిగ్గా రెస్పాండ్ కాలేదు అని నదీమ్ ఆరోపించాడు.

తన బండిని రిపేర్ చేయాల్సిందిగా పదే పదే అడుగుతూనే ఉన్నట్లు నదీమ్ వెల్లడించాడు. మంగళవారం కూడా నదీమ్ ఓలీ షోరూమ్ కి వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న సేల్స్ సిబ్బంది సరిగ్గా స్పందిచలేదని తెలుస్తోంది. విసిగెత్తిపోయిన నదీమ్ ఏకంగా షోరూమ్ కి నిప్పు పెట్టేశాడు. షోరూమ్ మీద పెట్రోల్ పోసి మరీ నిప్పు పెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దట్టమైన పొగలు షోరూమ్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఈ ప్రమాదంలో షో రూమ్ లో ఉన్న 6 స్కూటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే లోపల ఉన్న కంప్యూటర్లు కూడా తగలబడిపోయాయి.

ఓలా షోరూమ్ కి నిప్పు పెట్టిన ఘటనలో దాదాపుగా రూ.8 లక్షల 50 వేల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. షోరూమ్ కి నిప్పు పెట్టిన నదీమ్ ను పోలీసులు అరెస్టు చేశారు. షోరూమ్ సిబ్బంది సరిగ్గా స్పందించలేదని ఆగ్రహంతోనే ఇలా చేసినట్లు అతను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కలబుర్గి ఓలా షోరూమ్ తగలబడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నదీమ్ తన ఆగ్రహాన్ని చూపించిన విధానాన్ని కొందరు తప్పుబడుతున్నారు. ఇలా చేయకుండా ఉండాల్సిందని హితవు పలుకుతున్నారు. ఓలా సర్వీసింగ్ సపోర్ట్ మెరుగవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. ఓలా సర్వీసింగ్ విషయంలో ఇలాంటి ఫిర్యాదులు తరచుగా వస్తూనే ఉన్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి.. ఓలా షోరూమ్ కి కస్టమర్ నిప్పుపెట్టిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.