iDreamPost
android-app
ios-app

గవర్నమెంట్ స్కూల్లో అశ్లీల నృత్యాలు.. చిందులేసిన మందుబాబులు

విద్యాలయాలు గుడితో సమానం. ఇక్కడ సరస్వతి దేవి కొలువైందని నమ్ముతుంటారు. పిల్లలకు జ్ఞానాన్ని బోధించి.. విద్యాాబుద్దులు నేర్పించే ఆలయాలే బడులు. కానీ ఈ పాఠశాలలను కొంత మంది అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు.

విద్యాలయాలు గుడితో సమానం. ఇక్కడ సరస్వతి దేవి కొలువైందని నమ్ముతుంటారు. పిల్లలకు జ్ఞానాన్ని బోధించి.. విద్యాాబుద్దులు నేర్పించే ఆలయాలే బడులు. కానీ ఈ పాఠశాలలను కొంత మంది అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు.

గవర్నమెంట్ స్కూల్లో అశ్లీల నృత్యాలు..  చిందులేసిన మందుబాబులు

స్కూల్, కాలేజీల్లో విద్యార్థులను చదువులకే పరిమితం చేయకుండా.. అప్పుడప్పుడు ఈవెంట్స్ నిర్వహిస్తుంటాయి యాజమాన్యాలు. ప్రెషర్స్ డే అని, యానివర్శిడే అని, ఏదో ఒక స్పెషల్ డే అంటూ కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఆటలు, పాటలు నిర్వహిస్తుంటాయి. స్టూడెంట్స్‌ను చదువుల ఒత్తిడి నుండి తీసుకువచ్చేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటాయి. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే.. విద్యార్థులకు ఇవి ఆటవిడుపుగా ఉంటాయన్న సదుద్దేశంతో, వారి టాలెంట్ ఎంకరేజ్ చేసేందుకు ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. కానీ ఓ పాఠశాలను క్లబ్‌గా మార్చేశారు కొందరు. సరస్వతి నెలవున్న చోటును అపహాస్యం చేస్తూ బార్ అండ్ రెస్టారెంట్‌గా మార్చడంతో పాటు క్లబ్ డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఈ విస్తుగొల్పే ఘటన బీహార్‌లోని సహర్సా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.

ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకు అసలు ఏం జరిగిందంటే..? జలాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పెళ్లి జరుగుతుండగా.. బంధువులకు విడిది ఏర్పాట్లు ప్రభుత్వ పాఠశాలలో చేశారు. అక్కడకు పురుష పుంగవులంతా చేరి.. తాగి తందనాలు ఆడారు. విందు, వినోదం మొదలు పెట్టారు. అక్కడకు నలుగురు క్లబ్ డ్యాన్సర్లను పిలిపించుకుని చిందులేశారు. ఆ మహిళలు అశ్లీల దుస్తులు ధరించి భోజ్ పురి పాటలకు అసభ్యకరంగా డ్యాన్సులు వేస్తుంటే.. మగవాళ్లంతా వారితో కలిసి చిందులేశారు. మద్యం ఏరులై పారడంతో పీకల దాకా తాగారు. ఈ మత్తులో ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నామన్న విచక్షణ మరిచిపోయి.. తప్పతాగి అమ్మాయిలతో కలిసి డ్యాన్సులు వేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా బుద్దులు నేర్పించే పాఠశాలల్లో ఇలాంటి వేడుకలకు ఎలా అనుమతినిచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి ఈవెంట్ ఒకటి నిర్వహిస్తున్నట్లు అనుమతి తీసుకోలేదని, అలాంటి ఏ కార్యక్రమానికి పోలీసులు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ మమతా కుమారి స్పష్టం చేశారు. ఈ వీడియోను చూశాం, ఇలాంటి వాటిని ఉపేక్షించమంటూ స్టేట్ మెంట్ పాస్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇటీవల చెన్నై జరిగిన వైద్యుల కాన్సర్ట్‌లో కూడా ఈ తరహా ఘటనే వెలుగు చూసింది. వార్షిక సదస్సులో కాడ్బరీ డ్యాన్సులు వేయడంతో పెను దుమారమే రేగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ పాఠశాలలోనే అసభ్యకరంగా డ్యాన్సులు చేయించడం సంచలనంగా మారింది.  బడులను ఇలాంటి వేడుకలకు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.