iDreamPost
android-app
ios-app

వీడియో: ఎక్స్‌ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి! ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

  • Published Sep 27, 2024 | 3:13 PM Updated Updated Sep 27, 2024 | 3:13 PM

మొన్న గ్యాస్ సిలిండర్, ఆ తర్వాత సిమెంట్ దిమ్మ, ఐరన్ స్తంభం వంటివి ట్రాక్ కు అడ్డు పెట్టి రైలు ప్రమాదాలకు గురయ్యేలా చేసిన కుట్రలు అందరికీ సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనలో ప్రయాణికులు ఉన్న రైలు పై కొందరు ఆకయితాలు చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

మొన్న గ్యాస్ సిలిండర్, ఆ తర్వాత సిమెంట్ దిమ్మ, ఐరన్ స్తంభం వంటివి ట్రాక్ కు అడ్డు పెట్టి రైలు ప్రమాదాలకు గురయ్యేలా చేసిన కుట్రలు అందరికీ సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనలో ప్రయాణికులు ఉన్న రైలు పై కొందరు ఆకయితాలు చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Sep 27, 2024 | 3:13 PMUpdated Sep 27, 2024 | 3:13 PM
వీడియో: ఎక్స్‌ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి! ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

దేశంలో ఇండియాన్ రైల్వే వ్యవస్థపై అసలు ఏం కుట్ర జరుగుతుందో, ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు. ఎక్కడ చూసినా వరుస రైలు ప్రమాదాలు అనేవి వరుస చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ ప్రమాదాలు అనేవి సాంకేతిక లోపాలు,సిగ్నల్స్ తప్పిదాలు వలన జరిగినవి కొన్నాయితే, మరి కొన్ని మానవర ఆకయితాలు చేస్తున్న చర్యల వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా వరుస రైలు ప్రమాదాలు ఘటనలు వింటున్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసలు రైలు ఎక్కాలంటే భయంద్రోళనకు గురవుతున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటనలో ప్రయాణికులు ఉన్న రైలు పై కొందరు ఆకయితాలు చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మొన్న గ్యాస్ సిలిండర్, ఆ తర్వాత సిమెంట్ దిమ్మ, ఐరన్ స్తంభం వంటివి ట్రాక్ కు అడ్డు పెట్టి రైలు ప్రమాదాలకు గురయ్యేలా చేసిన కుట్రలు అందరికీ సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలు మరువక ముందే తాజాగా మరోసారి రైలు కొందరు ఆకయితాలు ఏకంగా ప్రయాణికులు ఉన్న రైలును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. తాజాగా స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అయితే ఈ భయంకరమైన ఘటన బీహర్ లో చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాల మేరకు.. బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలో స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ రైలుపై గురువారం రాత్రి రాళ్ల దాడి జరిగింది.

అయితే ఈ రైలు జైనగర్ నుంచి ఢిల్లీకి వెళ్లున్న సమయంలో ముజఫర్పూర్ సమస్తిపూర్ మార్గంలో సమస్తిపూర్ రైల్వే స్టేషన్ ఔటర్ సిగ్నల్ సమీపంలో రాత్రి 8:50 గంటల ప్రాంతంలో  జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇకపోతే ఎవరో కావలనే రైలు పై ఇలా రాళ్ల దాడి చేశారని, ఈ దాడిలో స్లీపర్ కోచ్, రైలు ప్యాంట్రీకార్, పక్క కోచ్లలో అద్దాలు పూర్తిగా ధ్వంసమైయ్యాయని అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనలో  పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని సమస్తిపూర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం  రైలు పై రాళ్లతో ధ్వంసం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఇకపోతే రైళ్లు పై ఇలా రాళ్ల దాడి చేయడంతో చాలామంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఈ రాళ్ల దాడి ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని, దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక ఈ దాడి కారణంగా రైలు 45 నిమిషాలు ఆలస్యంగా నడిచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరి, ఎక్స్ ప్రెస్ రైలు పై గుర్తు తెలియని దుండగులు రైళ్ల దాడి చేసి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.