iDreamPost
android-app
ios-app

Hyderabad: వీడియో: బైక్ పై రెచ్చిపోయిన ప్రేమ జంట.. అందరి ముందు సిగ్గు లేకుండా..

  • Published Sep 24, 2024 | 4:59 PM Updated Updated Sep 24, 2024 | 4:59 PM

Hyderabad- Pahadi Sharif- Viral Video Of Girl And Boy: యువత ఏదో రంగంలో వృద్ధిలోకి వచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారని ఆశిస్తుంటే.. వాళ్లు మాత్రం ఎలాంటి పిచ్చి పనులు చేయాలా అని రీసెర్చులు చేస్తున్నారు. నడిరోడ్డు పైకి వచ్చేసి హద్దులు దాటి వెర్రి పనులు చేస్తున్నారు.

Hyderabad- Pahadi Sharif- Viral Video Of Girl And Boy: యువత ఏదో రంగంలో వృద్ధిలోకి వచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారని ఆశిస్తుంటే.. వాళ్లు మాత్రం ఎలాంటి పిచ్చి పనులు చేయాలా అని రీసెర్చులు చేస్తున్నారు. నడిరోడ్డు పైకి వచ్చేసి హద్దులు దాటి వెర్రి పనులు చేస్తున్నారు.

  • Published Sep 24, 2024 | 4:59 PMUpdated Sep 24, 2024 | 4:59 PM
Hyderabad: వీడియో: బైక్ పై రెచ్చిపోయిన ప్రేమ జంట.. అందరి ముందు సిగ్గు లేకుండా..

భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువతను కలిగిన దేశం. ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారత్ వైపు చూడటానికి అదే ప్రధాన కారణం కూడా. ఇండియా.. ప్రపంచాన్నే శాసించే ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ఆ యువత తప్పకుండా దోహద పడుతుందని ఆకాంక్షిస్తున్నారు కూడా. అయితే ఇక్కడ కొందరి తీరు మాత్రం అందకు పూర్తి భిన్నంగా ఉంది. దేశానికి వెన్నెముక అవుతారని భావిస్తున్న యువతలో ఎక్కువ శాతం మంది వికృత చేష్టలు చేయడంలో బిడీగా గడిపేస్తున్నారు. దేశం సంగతి పక్కన పెట్టండి కనీసం వాళ్ల జీవితం, కెరీర్, కుటుంబం గురించి కూడా లెక్క లేకుండా చేస్తున్నారు. అదేంట్రా అంటే బైకులు ఎక్కేసి రోడ్ల మీదకు వచ్చి.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. అలాంటి వారిని చూస్తే అసలు సమాజం ఎటు పోతోంది? అనే అనుమానం కచ్చితంగా వస్తుంది. అసలు ఏం జరిగింది? ఆ పిచ్చి చేష్టలు చేసింది ఎవరు? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.

యువత రోడ్ల మీదకు వచ్చి పిచ్చి చేష్టలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఎవరినీ లెక్క చేయకుండా ఇష్టారీతిన హద్దులు దాటేసి ప్రవర్తిస్తున్నారు. ఒక్కోసారి వాళ్లు చేసే పనులు చూస్తే అసలు యువత ఇంత పెడదోవన ఎలా పడుతున్నారు అనే అనుమానం రాక మానదు. ఇప్పుడు చెప్పుకుంటోంది కూడా అలాంటి ఒక ప్రేమ జంట గురించే. ఒక యువతీ యువకుడు నడిరోడ్డు మీద చేసిన ఒక ఘనకార్యం గురించి. పైగా ఆ సంఘటన జరిగింది ఎక్కడో కాదు.. హైదరాబాద్ లోనే. ఒక యువతీ- ఆమె ప్రియుడు నడిరోడ్డు మీద రెచ్చిపోయారు. చుట్టూ జనాలు చూస్తున్నా “నలురుగు నవ్విపోనీ.. నాకేంటి సిగ్గు” అనే సామెత చెప్పినట్లు విచ్చలవిడిగా ప్రవర్తించారు.

పాత బస్తీలోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒక యువతి తన ప్రియుడితో కలిసి బైక్ పై షికార్లు చేస్తోంది. యువకుడు బైక్ నడుపుతున్నాడు. ఆ యువతి అతనికి ఆపోజిట్ లో ఒడిలో కూర్చుని గట్టిగా కౌగిలించుకుని కూర్చుంది. చుట్టూ జనం చూస్తూనే ఉన్నారు. అయినా కూడా ఏమాత్రం బెరుకు లేకుండా.. అతడిపై ముద్దుల వర్షం కురిపించింది. వీళ్లతో పాటుగా రోడ్డు మీద వాహనాలు కూడా ఉన్నాయి. కొందరు బైక్ మీద కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆ వీడియోలో చూస్తే.. వెనుక ఉన్న బైక్ పై మహిళ కూడా ఉంది. అలా వీళ్ల వికృత చేష్టలను చూస్తున్న వాళ్లు సిగ్గుతో తలదించుకున్నారు కానీ.. వాళ్లు మాత్రం పేట్రేగిపోయారు. వీళ్ల బాగోతం చూస్తున్న వాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. కొందరు మాత్రం తేరుకుని వీళ్ల విచ్చలవిడి తనాన్ని తమ ఫోన్లలో బందించారు. ఆ తర్వాత వీళ్ల బరితెగింపును సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా.. వైరల్ గా మారింది.

ఈ ప్రేమ జంట వీడియో చూసిన వాళ్లంతా ఆ జంటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి ఇవేం పిచ్చి పనులు అని ప్రశ్నిస్తున్నారు. బైక్ ని నిర్లక్ష్యంగా నడపడమే కాకుండా.. అలా అందరి ముందు హద్దులు దాటి ప్రవర్తించడం ఏంటని పెదవి విరుస్తున్నారు. యువతి మరీ బరితెగించి యువకుడిపై ముద్దుల వర్షం కురిపిస్తోందని ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరైతే వీళ్లు ఇలా పేట్రేగిపోవడానికి కారణం వారిని పట్టించుకోని తల్లిదండ్రులు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లు సరిగ్గా పట్టించుకోకనే వీళ్లు ఇలా వికృత చేష్టలకు ఒడిగడుతున్నారు అంటూ కన్నెర్ర చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. మరి.. నడిరోడ్డుపై ఈ ప్రేమ జంట చేసిన పిచ్చి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişasyabahis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom