iDreamPost
android-app
ios-app

Anand Mahindra: చికెన్ పకోడీ అమ్మే కుర్రాడు.. ఆనంద్ మహీంద్రాని మెప్పించాడు!

Anand Mahindra- Chennai Phd Scholar Chicken Stall: ఆనంద్ మహీంద్రా రోజూ ఏదో ఒక సందేశానాత్మక వీడియోలు, పోస్టులు షేర్ చేస్తూనే ఉంటారు. అలాగే తాజాగా ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఉన్న కుర్రాడు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు.

Anand Mahindra- Chennai Phd Scholar Chicken Stall: ఆనంద్ మహీంద్రా రోజూ ఏదో ఒక సందేశానాత్మక వీడియోలు, పోస్టులు షేర్ చేస్తూనే ఉంటారు. అలాగే తాజాగా ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఉన్న కుర్రాడు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు.

Anand Mahindra: చికెన్ పకోడీ అమ్మే కుర్రాడు.. ఆనంద్ మహీంద్రాని మెప్పించాడు!

ఆనంద్ మహీంద్రా ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా అందరికీ తెలుసు. ఆయన ఒక బాధ్యతగల పౌరుడు అనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆనంద్ మహీంద్రా ఎంత బిజీగా ఉన్నా.. కాస్త సమయం తీసుకుని నెటిజన్స్ ని ఎడ్యుకేట్ చేస్తుంటారు. యువతను సరైన మార్గంలో నడిపేలా ఆయన పోస్టులు ఉంటాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూస్తే మీరు కూడా ఆ మాటను ఒప్పుకోవాల్సిందే. ఆయన ఎప్పటిలాగానే ఒక వీడియో షేర్ చేశారు. అది సందేశాత్మకంగా ఉంటుందని ఓపెన్ చేయకుండా కూడా చెప్పచ్చు. కానీ, భారతదేశ యువత సత్తా చాటే విధంగా ఉంటుందని ఎవరూ అనుకోరు. ఆనంద్ మహీంద్రా ఒక కుర్రాడి వైరల్ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఒక అమెరికన్ వ్లాగర్ చెన్నైలోని ఒక ఫేమస్ చికెన్ పకోడీ స్టాల్ ని షూట్ చేస్తున్నాడు. ఆ స్టాల్ నడుపుతున్న కుర్రాడితో మాటలు కలిపాడు. అప్పటి వరకు అతను ఒక సక్సెస్ ఫుల్ వ్యాపారి అని మాత్రమే అనుకున్నారు. కానీ, కాసేపటికే అసలు విషయం తెలిసింది. అతను ఒక PHd స్కాలర్ అని. ఇంకా ఆ వీడియోలో అబ్బుర పడాల్సిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి.. ఆ కుర్రాడు ఎవరు? ఆనంద్ మహీంద్రా ఎందుకు అంత ఇంప్రెస్ అయ్యారో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ వైరల్ వీడియో షూట్ చేసింది.. ఫేమస్ యూట్యూబర్ క్రిస్టోఫర్ లెవిస్. ఇతను దేశ దేశాలు తిరుగుతూ ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు. అలాగే చెన్నైలో తిరుగుతున్న సమయంలో ఒక చికెన్ పకోడి స్టాల్ గురించి వీడియో చేశాడు. క్రిస్టోఫర్ గూగుల్ మ్యాప్స్ లో చికెన్ 65 అని సెర్చ్ చేయగానే ఈ కుర్రాడి స్టాల్ వచ్చిందంట. అతను నేరుగా స్టాల్ దగ్గరకు వెళ్లి 100 గ్రాముల చికెన్ 65 ఆర్డర్ చేశాడు. క్రిస్టోఫర్ తన వీక్షకుల కోసం షాప్స్ వారితో మాటలు కలుపుతూ ఉంటాడు. అలాగే గూగుల్ లో సెర్చ్ చేస్తే.. అతనికి ఈ స్టాల్ చూపించిందని చెప్పాడు. ఆ తర్వాత మాటల్లో ఆ చికెన్ స్టాల్ రన్ చేస్తున్న యువకుడు స్టూడెంట్ అని తెలిసింది. అది కూడా ఏ డిగ్రీనో.. ఇంజినీరింగో కాదండోయ్. అతను ఒక PHD స్కాలర్.

ఆ యువకుడి పేరు తరుల్ రాయన్. తరుల్ రాయన్ బయో టెక్నాలజీలో రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నాడు. ఈ చికెన్ పకోడీ స్టాల్ ని అతను పార్ట్ టైమ్ గా రన్ చేస్తున్నాడు. తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడు తాను ఈ బండిని స్టార్ట్ చేసినట్లు తెలిపాడు. చికెన్ 65 టేస్ట్ చేసిన క్రిస్టోఫర్ కూడా మంచి రివ్యూ ఇచ్చాడు. అతని చికెన్ 65, చికెన్ కట్లెట్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాడు. తరుల్ రాయన్ ఇదంతా చెబుతూ.. క్రిస్టోఫర్ ఫోన్ తీసుకున్నాడు. ఆ సమయంలో రాయన్ తనకు చెందిన సోషల్ మీడియా పేజో, తనకు సంబంధించిన న్యూస్ చూపిస్తాడమే అనుకున్నాడు. కానీ, తరుల్ రాయన్ మాత్రం తన పేరు మీద ఉన్న రీసెర్చ్ వర్క్ ని చూపించాడు.

అతను రాసిన ఆర్టికల్స్ ని సగర్వంగా చూపించాడు. ఇవి చూసిన క్రిస్టోఫర్ కూడా షాకయ్యాడు. అలాగే రాయన్ చదువు కోసం, అతని రీసెర్చ్ కోసం కాస్త ఆర్థిక సాయం కూడా చేశాడు. ఆనంద్ మహీంద్రాని కూడా తరుల్ రాయన్ చేసిన ఆ పనే కట్టి పడేసింది. రాయన్ సోషల్ మీడియా పేజెస్ కాకుండా.. అతని అకెడమిక్స్ గురించి అంత గొప్పగా చెప్పుకోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఆ విషయాన్ని షేర్ చేస్తూనే.. తరుల్ రాయన్ ఒక ‘ఇన్ క్రైడబుల్, యునిక్, ఇండియన్’ అంటూ ప్రశంసించాడు. ఇప్పటికే తరుల్ రాయన్ గురించి.. చికెన్ పకోడీ స్టాల్ గురించి ఎంతో మంది మాట్లాడుకుంటున్నారు. ఎన్నో కథనాలు కూడా వచ్చాయి. ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా తరుల్ రాయన్ గురించి మాట్లాడుకుంటున్నారు. మరి.. PHD స్కాలర్ తరుల్ రాయన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.