iDreamPost
android-app
ios-app

వీడియో: పెళ్లి బరాత్‌లో కురిసిన డబ్బు వర్షం..ఎగబడిన జనం! ఎక్కడో తెలుసా?

  • Published Nov 20, 2024 | 1:15 PM Updated Updated Nov 20, 2024 | 1:15 PM

Wedding Procession: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి సంబరాల్లో కొన్ని ఆసక్తికరమైన, షాకింగ్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

Wedding Procession: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి సంబరాల్లో కొన్ని ఆసక్తికరమైన, షాకింగ్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

వీడియో: పెళ్లి బరాత్‌లో కురిసిన డబ్బు వర్షం..ఎగబడిన జనం! ఎక్కడో తెలుసా?

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు మూఢాల కారణంగా వివాహాది శుభకార్యాలు జరపకూడదని వేద పండితులు తెలిపారు. గురు, శుక్ర మూఢాల్లో వివాహాలు చేయడం మంచిది కాదని పండితులు సూచించారు. దీంతో మూడు నెలలు ఎలాంటి శుభకార్యాలు జరగలేదు. ఇటీవల దేశ వ్యాప్తంగా మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. నవంబర్, డిసెంబర్ నెలలో మంచి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఈ రెండు నెలల్లోనే సుమారు 48 లక్షల వివాహాలు జరగనున్నాయని అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇటీవల పెళ్లి సంబరాల్లో కొన్ని ఆసక్తికరమైన, షాకింగ్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. పెళ్లి పీటలపై వధూవరుల మధ్య చిలిపి సంఘటనలు, గొడవలకు సంబంధించినవి కొన్నైతే.. బారాత్ లో మందుబాబులు చేసే హల్ చల్ మరికొన్ని. ఇటీవల పెళ్లి బారాత్ లో డ్యాన్సులు చేస్తూ రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వారు కూడా ఉన్నారు.  ఇలాంటి చిత్ర విచిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి బారాత్ సందర్బంగా కొంతమంది మేడ పై నుంచి నోట్ల వర్షం కురిపించారు.దీనికి సంబంధించిన వీడియో పోలీసులకు చేరడంతో చర్యలు మొదలు పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. సిద్ధార్థనగర్‌ దేవల్వా గ్రామంలోని ఓ పెళ్లి బారాత్ జరుగుతుంది. కొంతమంది యువకులు మేడపైకి ఎక్కారు. సంచుల్లో కరెన్సీ నోట్లు తీసుకువచ్చారు. వధూవరులు కారు మేడవద్దకు రాగానే ఒక్కసారే కరెన్సీ నోట్లను గాల్లోకి వెదజల్లారు. రూ.100, రూ.200, రూ.500 నోట్లు గాల్లోకి విసిరినట్లు సమాచారం. ఇందుకోసం జేసీబీని కూడా పిలిపించారు. కొంతమంది దానిపై.. మరికొంత మంది మేడపై నుంచి ఈ నోట్లను ఇష్టానుసారంగా వెదజల్లారు. అయితే నోట్లు వెదజల్లుతున్నారన్న విషయం తెలిసి గ్రామస్థులు ఎగబడ్డారు. ఆ సమయంలో తొక్కిసలాట కూడా జరిగింది. దాదాపు రూ.20 లక్షల వరకు కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో పోలీసులకు చేరడంతో దీనిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సిద్దార్థ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ ని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. గతంలో కూడా పెళ్లి బారాత్ లో డబ్బులు వెదజల్లిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. వాటిని తీసుకోవడానికి వచ్చిన జనాలు కొట్టుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో పలువురు తీవ్రస్థాయిలో స్పందించారు. ఇంత భారీ మొత్తాన్ని వెదజల్లుతున్నారంటే.. వాళ్లు బాగా డబ్బు ఉన్నవారై ఉంటారు. ఇలాంటి వారికి ఐటీ డిపార్ట్ మెంట్ సరైన బుద్ది చెప్పాలని, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ జరిపించాలని కోరారు. అంత డబ్బు ఉంటే దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఆ డబ్బును స్వచ్ఛంద సంస్థల ద్వారా పేదలకు పంచి పెట్టొచ్చు కదా అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇలాంటి మూర్ఖులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరారు.