iDreamPost
android-app
ios-app

వీడియో: లక్షల్లో లంచాలు తీసుకుంటున్న భార్య.. ఉత్తమ భర్త ఏం చేశాడంటే?

  • Published Oct 09, 2024 | 12:57 PM Updated Updated Oct 09, 2024 | 12:57 PM

Corruption Allegations On Manikonda Municipal DEE: లంచం తీసుకోవడం నేరం అని అందరికీ తెలుసు. కానీ, అలా లంచాలు తీసుకునే వారిని పట్టించాలి అంటే మాత్రం ఎవరూ ముందుకు రారు. కానీ, ఒక మగజాతి ఆణిముత్యం ఆ పని చేశాడు. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా తన బండారాన్ని బయటపెట్టాడు.

Corruption Allegations On Manikonda Municipal DEE: లంచం తీసుకోవడం నేరం అని అందరికీ తెలుసు. కానీ, అలా లంచాలు తీసుకునే వారిని పట్టించాలి అంటే మాత్రం ఎవరూ ముందుకు రారు. కానీ, ఒక మగజాతి ఆణిముత్యం ఆ పని చేశాడు. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా తన బండారాన్ని బయటపెట్టాడు.

  • Published Oct 09, 2024 | 12:57 PMUpdated Oct 09, 2024 | 12:57 PM
వీడియో: లక్షల్లో లంచాలు తీసుకుంటున్న భార్య.. ఉత్తమ భర్త ఏం చేశాడంటే?

ఇటీవల శంకర్- కమల్ హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 సినిమా చూసే ఉంటారు. ఆ మూవీలో లంచం మీద పోరాటాన్ని వినూత్నంగా చూపించారు. మీ ఇంట్లో ఉన్న వాళ్లు తప్పు చేస్తే.. మీరే పట్టించాలి అన్న పాయింట్ బాగా హైలెట్ అయ్యింది. సినిమా ఫ్లాప్ అయినా.. ఆ పాయింట్ మాత్రం జనాల్లోకి బాగా వెళ్లింది. అయితే అలాంటివి నిజ జీవితంలో సాధ్యమా అంటే.. కాదు అనే చెప్పాలి. ఎవరూ కూడా తమ సొంతవాళ్లని లంచం తీసుకుంటున్నారు అని పట్టించరు. కానీ, ఒక మగజాతి ఆణిముత్యం ఆ పని చేసి చూపించాడు. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమెను అడ్డంగా బుక్ చేశాడు. తన భార్య లక్షల్లో లంచాలు తీసుకుంటోంది అంటూ వీడియోలు తీసి.. ఆమె బండారాన్ని బయట పెట్టాడు. తన భార్య కంటే సమాజమే ముఖ్యమని ఈ భర్త చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ భార్య నిజంగానే లంచాలు తీసుకుంటోందా? పూర్తి వివరాలు చూద్దాం.

సమాజాన్ని పీడిస్తున్న ఎన్నో మహమ్మారుల్లో లంచం కూడా ఒకటి. లంచం తీసుకోవడం నేరం అని అందరికీ తెలుసు. అలాగే లంచం ఇవ్వడం కూడా నేరమే. లంచాన్ని నిర్మూలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఏదో ఒక దగ్గర అది పడగలు విప్పుతూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. అయినా అలాంటి వారిలో మార్పు రావడం లేదు. దొరికితేనే దొంగ అనే ధోరణి చాలా మందిలో కనిపిస్తోంది. తాజాగా ఒక అధికారిణి లంచం తీసుకుంటోంది అంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలు చేసింది మరెవరో కాదు. స్వయంగా కట్టుకున్న భర్తే ఈ ఆరోపణలు చేశారు. తన భార్య ఒక లంచగొండి అంటూ వీడియోలు తీసి అధికారులకు అప్పగించాడు.

ఇంట్లో ఉన్న కట్టల కట్టల డబ్బును చూపిస్తూ తన భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య మణికొండ మున్సిపల్ డీఈఈగా దివ్యజ్యోతిగా తెలుస్తోంది. తన భర్తే ఆమెపై ఆరోపణలు చేశారు. కేవలం విమర్శలు మాత్రమే కాకుండా.. అందుకు సంబంధించి వీడియోలు కూడా రిలీజ్ చేశారు. తన భార్య తీసుకుంటున్న లంచం డబ్బులు చూడండి అంటూ వీడియోలో చూపించారు. ఇంట్లో దాటిపెట్టిన కట్టల కట్టల డబ్బు అంతా లంచాలుగా తీసుకున్నదే అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. దాదాపుగా ఇంట్లో 80 లక్షల రూపాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భార్య అసలు లంచం తీసుకోకుండా ఇంటికి చ్చేది కాదు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. లంచాలు తీసుకోవద్దని ఎంత వారించినా తాను అస్సలు వినేది కాదు అంటూ విమర్శలు చేశారు.

లంచం తీసుకునే విషయంలో తన భార్యతో గొడవ కూడా అయినట్లు ఆయన వెల్లడించారు. తన భార్య ఇలా లంచాలు తీసుకోవడం తనకు నచ్చడం లేదన్నారు. ఎంత చెప్పినా తను వినడం లేదని.. ఇలా వీడియో తీస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు దివ్యజ్యోతిపై వచ్చిన లంచం ఆరోపణల నేపథ్యంలో ఆమె రెండ్రోజుల క్రితం GHMCకి బదిలీ చేయించుకున్నారు. ఇప్పుడు నెట్టింట ఈ ఉత్తమ భర్తపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. లంచం తీసుకుంటోంది భార్య అయినా కూడా గొప్ప నిర్ణయం తీసుకున్నాడని పొగిడేస్తున్నారు. ఈ సమాజానికి ఇలాంటి భర్తలు కావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మగజాతికి దొరికి ఆణిముత్యం అంటూ పొగిడేస్తున్నారు. మరి.. ఈ ఉత్తమ భర్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş