iDreamPost
android-app
ios-app

70 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన 20 ఏళ్ల యువతి..! వీడియో వైరల్

  • Published Sep 27, 2024 | 6:53 PM Updated Updated Sep 27, 2024 | 6:53 PM

ప్రేమ ఏ వయస్సులో, ఎప్పుడు, ఎవరితో పుడుతుందో చెప్పడం కష్టం. కుల, మతాలను చూడదు లవ్. అలాగే వయస్సు తారతమ్యాలను కూడా పట్టించుకోదు. అందుకు ఉదాహరణ ఈ పెళ్లి..

ప్రేమ ఏ వయస్సులో, ఎప్పుడు, ఎవరితో పుడుతుందో చెప్పడం కష్టం. కుల, మతాలను చూడదు లవ్. అలాగే వయస్సు తారతమ్యాలను కూడా పట్టించుకోదు. అందుకు ఉదాహరణ ఈ పెళ్లి..

  • Published Sep 27, 2024 | 6:53 PMUpdated Sep 27, 2024 | 6:53 PM
70 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన 20 ఏళ్ల యువతి..! వీడియో వైరల్

లవ్, ఇష్క్, కాదల్.. భాష ఏదైనా భావం ఒక్కటే. ఎప్పుడు ప్రేమ పుడుతుంటే చెప్పడం కష్టం. ఈ వయస్సులోనే లవ్ కలుగుతుందన్న నిర్దిష్టమైన ఆధారాలు లేవు. కానీ ఈ రోజుల్లో ఇద్దరి ప్రేమికుల మధ్య వయస్సు తేడా భారీగా ఉంటుంది. అందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు. ఏజ్‌లో తన కన్నా చాలా పెద్దదైనా అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు యువకులు. అలాగే.. తన తండ్రి కాదు కాదు.. తాత వయస్సు ఉన్న వ్యక్తులతో ప్రేమలో పడుతున్నారు యువతులు. వారితో ఏడడుగులు వేస్తున్నారు. తాజాగా ఓ 20 ఏళ్ల యువతి.. కాటికి కాలుచాపే వయస్సున్న 70 ఏళ్ల వృద్ధుడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరు దండలు మార్చుకున్న వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూస్తే ప్రేమ గుడ్డిది అనిపించక మానదు. ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే..?

70 ఏళ్ల వృద్ధుడు, 20 ఏళ్ల యువతి మెడలో దండలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే పలుమార్లు ఒకరి మెడలో మరొకరు పూలమాలలు మార్చుకుంటున్నారు. ఇందులో యువతి ఎంతో ఆనందంగా ఉండటం చూస్తుంటే.. ఆమె ఇష్టప్రకారమే ఈ పెళ్లి జరిగినట్లు కనిపిస్తుంది.  వరుడు ఎదురుగా నిలబడి సిగ్గుల మొగ్గ అవుతుంది వధువు. వెనుక కుటుంబ సభ్యులు పూలు జల్లి ఈ నూతన దంపతులను ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు తమదైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. సోదరా, ఇది కలియుగం, ఏదైనా జరగొచ్చు అంటూ ఓ యూజర్ రాసుకొచ్చాడు. గుర్రాలకు గడ్డి దొరకడం లేదంటే.. గాడిదలు చ్యవనప్రాస్ తింటున్నాయి అంటూ మరొకరు కామెంట్స్ చేశారు. ఆ వృద్ధుడు తన ఆస్తినంతా కట్నంగా ఇచ్చాడు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు

అయితే ఈ మధ్య కాలంలో కొంత మంది ఫేమ్ అయ్యేందుకు ఇటువంటి వీడియోలు చేసి.. వార్తల్లో నిలుస్తున్నారు. ఒక్క రోజులో సెలబ్రిటీలు అయిపోవాలన్న ఉద్దేశంతో రీల్స్, షాట్స్ అంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే ఓ వైపు ఇటువంటి సందేహం కలుగకమానదు. అమ్మాయి చేతికి గాజులు లేకపోవడంతో పాటు.. ఏదో స్కిట్‌లా కనిపిస్తుంది కూడా. వెనుక చిన్న పిల్లలు అక్షింతలు వేస్తుండటం చూస్తుంటే.. ఇది రియల్ వివాహమా, రీల్ వివాహమా అన్న అనుమానం వస్తుంది. ఒక వేళ నిజం అయితే.. ఇక యువకులు కుళ్లుకోవాల్సిందే. పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలు దొరకడం కష్టంగా మారిపోతున్న ఈ తరుణంలో.. తాత వయస్సున్న వ్యక్తులతో అమ్మాయిలు ప్రేమ, పెళ్లిళ్లు చేసుకుంటే బ్రహ్మాచారులు పరిస్థితి ఏం కావాలో చెప్పండి. మరీ ఈ వీడియోలో రియల్ పెళ్లేనంటారా..? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio