iDreamPost
android-app
ios-app

Tulsi Kumar: సెట్స్ లో నటికి ప్రమాదం.. లైవ్ లో రికార్డ్ అయిన షాకింగ్ విజువల్స్..

  • Published Oct 08, 2024 | 1:01 PM Updated Updated Oct 08, 2024 | 1:01 PM

Tulsi Kumar Got Injured On Sets: సాధారణంగా సినిమా షూటింగ్స్ అంటే కత్తి మీద సాములాగానే ఉంటుంది. అయితే చాలాసార్లు సక్సెస్ ఫుల్ గానే షూట్ పూర్తవుతుంది. కానీ, కొన్నిసార్లు మాత్రం అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలా ఇప్పుడు ఓ నటికి భారీ ప్రమాదం తప్పింది.

Tulsi Kumar Got Injured On Sets: సాధారణంగా సినిమా షూటింగ్స్ అంటే కత్తి మీద సాములాగానే ఉంటుంది. అయితే చాలాసార్లు సక్సెస్ ఫుల్ గానే షూట్ పూర్తవుతుంది. కానీ, కొన్నిసార్లు మాత్రం అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలా ఇప్పుడు ఓ నటికి భారీ ప్రమాదం తప్పింది.

  • Published Oct 08, 2024 | 1:01 PMUpdated Oct 08, 2024 | 1:01 PM
Tulsi Kumar: సెట్స్ లో నటికి ప్రమాదం.. లైవ్ లో రికార్డ్ అయిన షాకింగ్ విజువల్స్..

సినిమాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ కోట్లలో ఉన్నారు. అయితే ఈ మూవీస్ కి సంబంధించి తెర వెనుక ఎంత కష్టం ఉంటుందో అందరికీ తెలియకపోవచ్చు. తమ అభిమాన హీరోని స్క్రీన్ మీద చూసి మురిసపోతూ ఉంటారు. అయితే ఆ హీరోని అంత బాగా చూపించడానికి కొన్ని వందల మంది కష్టపడుతూ ఉంటారు. అలాగే ఆ హీరో కూడా చాలానే తిప్పలు పడతాడు. దాదాపుగా షూటింగ్స్ అంటే కష్టం ఉన్నా కూడా సరదాగా సాగిపోతూ ఉంటాయి. కానీ, కొన్నిసార్లు మాత్రం షూటింగ్స్ లో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక ప్రమాదం తాజాగా ఒక షూటింగ్ సెట్ లో జరిగింది. ఈ ప్రమాదంలో ఒక నటి తృటిలో తన ప్రాణాలను కాపాడుకుంది. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి.. ఆ నటి ఎవరు? ఏ షూటింగ్ లో ప్రమాదం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఈ ప్రమాదం జరిగింది టాలీవుడ్ లో కాదులెండి. బాలీవుడ్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నటి తులసి కుమార్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. బాలీవుడ్ ప్రేక్షకులకు తులసి కుమార్ సుపరిచితురాలే. ఆమె ప్లేబ్యాక్ సింగర్, మ్యూజీషియన్, నటి కూడా. ఆమె పాటలకు మంచి రెస్పాన్స్ కూడా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా తులసి కుమార్ ప్రముఖ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ సోదరి కూడా. ఈమె తన కొత్త ఆల్బమ్ ని షూట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తన పాటకు సంబంధించి సెట్స్ ని ఏర్పాటు చేశారు. షూటింగ్ నడుస్తూ ఉంది.

తులసి కుమార్ కెమెరాను చూస్తూ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఉంది. ఆ సెటప్ చూస్తే ఒక బెడ్ ని పైకి లేపి నిలబెట్టినట్లు ఉన్నారు. అయితే ఆ సెటప్ కి సైడ్ సపోర్ట్ గా పెట్టిన చెక్క ఒక్కసారిగా పడిపోయింది. ఆ చెక్క పడిపోవడంతో బెడ్ సెటప్ ముందుకు పడింది. అయితే నటి తులసి ఆ ముందే నిల్చుని షూట్ చేస్తూ ఉంది. ఆ బెడ్ ఒక్కసారిగా వచ్చి తులసి మీద పడబోయింది. తులసి కుమార్ ముందే తేరుకుని కాస్త ముందుకు జరిగింది. అయినా కూడా ఆ చెక్క వచ్చి ఆమె మీద పడినట్లు కనిపించింది. నిజానికి పక్కనే ఉన్న వ్యక్తి త్వరగా రియాక్ట్ అయ్యాడు. ఆ చెక్కను పూర్తిగా కింద పడకుండా చేతులతో ఆపాడు. కానీ, అప్పటికే తులసి కుమార్ కు గాయాలు అయినట్లు కనిపించింది. ఆమె వీపు మీద ఆ చెక్క పడినట్లు విజువల్స్ లో కనిపించింది.

తులసి కుమార్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆమె ముఖంలో ఆ భయం స్పష్టంగా కనిపించింది. వెంటనే క్రూ సభ్యులు మొత్తం తులసి కుమార్ వద్దకు వచ్చారు. ఆమెకు ఏమైనా దెబ్బలు తగిలాయేమో చూశారు. ఈ దృశ్యాలు మొత్తం కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తులసి కుమార్ ఫ్యాన్స్, నెటిజన్స్ అంతా కాస్త కంగారు పడ్డారు. షూటింగ్ సెట్ ని అంత నిర్లక్ష్యంగా ఎవరు తయారు చేశారు అని ప్రశ్నిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ నిర్లక్ష్యం వల్ల తులసి కుమార్ ప్రాణాలకే ప్రమాదం జరిగేది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెట్స్ లో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరి.. తులసి కుమార్ కి జరిగిన ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss