iDreamPost
android-app
ios-app

వీడియో: ఛీ..ఛీ.. వంట మనిషి దారుణం.. మూత్రం కలుపుతూ చపాతీ తయారీ..

  • Published Oct 17, 2024 | 5:44 PM Updated Updated Oct 17, 2024 | 5:46 PM

Ghaziabad: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వీడియోలు చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్తితి నెలకొంది. ఎనిమిదేళ్లుగా ఎంతో నమ్మకంగా ఉంటూ యజమానుల మెప్పు పొందిన ఓ పనిమనిషి చేసిన సిగ్గుమాలిన పని నెట్టింట వైరల్ అవుతుంది.

Ghaziabad: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వీడియోలు చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్తితి నెలకొంది. ఎనిమిదేళ్లుగా ఎంతో నమ్మకంగా ఉంటూ యజమానుల మెప్పు పొందిన ఓ పనిమనిషి చేసిన సిగ్గుమాలిన పని నెట్టింట వైరల్ అవుతుంది.

  • Published Oct 17, 2024 | 5:44 PMUpdated Oct 17, 2024 | 5:46 PM
వీడియో: ఛీ..ఛీ.. వంట మనిషి దారుణం.. మూత్రం కలుపుతూ చపాతీ తయారీ..

సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందినవారు, ఇద్దరు జాబ్ చేస్తూ బిజీగా ఉండే భార్యభర్తలు, వయసు మీద పడి పనిచేయలేని వారు ఇంటి పనుల కోసం పని మనిషిని పెట్టుకుంటారు. కొంతమంది పని మనుషులు ఎంతో బాధ్యతతో ఉంటూ యజమానుల మెప్పు పొందుతారు. అలాంటి పనిమనుషులు ఏళ్ల తరబడి తమ యజమానుల సేవలో ఉంటారు. కానీ, ఇటీవల కొంతమంది పనిమనుషులు చేస్తున్న దారుణాలు సోషల్ మీడియాలో వెలుగు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యాపారి ఇంట్లో పనిమని చేసిన గలీజ్ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకొని ఉన్న ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ సొసైటీ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా ఉంటున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో పని మనిషి దాదాపు ఎనిమిదేళ్లుగా ఉంటూ ఎంతో నమ్మకాన్ని సంపాదించింది. ఆమె అంటే ఆ ఇంట్లో అందరికీ మంచి అభిమానుం. ఆమె వంటకాలు అన్న కూడా ఎంతో ఇష్టం. ఇటీవల ఆ వ్యాపారి ఇంట్లో కుటుంబ సభ్యులు వరుసగా ఆస్పత్రి పాలవుతూ వచ్చారు. అందరికీ లివర్ ఇన్‌ఫెక్షన్ సమస్య వచ్చింది. దీంతో డాక్టర్లను సంప్రదించగా కలుషిత ఆహారం వల్లనే అనారోగ్య సమస్యలు తలెత్తాయని తెలిపారు. దీంతో బయట ఫుడ్ పూర్తిగా మానిపించాడు సదరు వ్యాపారి. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లో ఫుడ్ తింటున్నారు వ్యాపారి కుటుంబ సభ్యులు.

వారం రోజు క్రితం వ్యాపారి చిన్న కొడుకు ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వ్యాపారికి తాము తింటున్న ఆహారంలో ఏదైనా కల్తీ జరుగుతుందా? అన్న అనుమానం వచ్చింది.  వంటింట్లో ఓ సీక్రెట్ సీసీ కెమెరా అమర్చాడు. అక్కడ పని మనిషి వంటలు ఎలా వండుతుందో పరిశీలించాలని అనుకున్నాడు. ఆ రహస్య కెమెరాలో దృశ్యాలు చూసి సదరు వ్యాపారికి చెమటలు పట్టాడు.. వాంతులు చేసుకున్నాడు. ఎనిమిదేళ్ళుగా ఎంతో నమ్మకంగా ఉంటున్న ఆ వంట మనిషి తన మూత్రం కలిపి వంట చేయడం చూసి షాక్ తిన్నాడు. వీడియోలో ఆమె ఒక వంట పాత్రలో తన మూత్రం పోసి అందులో చపాతీ పిండి కలిపి రొట్టెలు చేయడం రికార్డు అయ్యింది. వెంటనే ఆ వీడియో తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వ్యాపారి ఇచ్చి ఫిర్యాదు మేరకు వంట మనిషిని అరెస్ట్ చేశారు. గాజియాబాద్ లోని శాంతి నగర్ ప్రాంతంలో నివసించే రీనా అనే మహిళ ఏనిమిదేళ్ళుగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో పనిచేస్తుంది. గత ఏడాది ఆ ఇంట్లో వస్తువులు మాయమైతున్నాయని వంట మనిషిపై వ్యాపారి భార్య సీరియస్ అయ్యింది. అయినా ఆమెను పనిలో పెట్టుకున్నాన్నారు. ఆ పగ మనసులో పెట్టుకొని ఇలాంటి దారుణానికి తెగబడి ఉండవొచ్చని భావిస్తున్నారు పోలీసులు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss