విజయవాడకు చెందిన మహిళ మిసెస్ ప్లానెట్ కిరీటాన్ని దక్కించుకున్నారు. బల్గేరియాలో జరిగిన అందాల పోటీల్లో విజయవాడ యువతి బిల్లుపాటి నాగమల్లిక పోటీపడ్డారు. ఈ కిరీటం కోసం 60 దేశాలకు చెందిన మహిళలు పోటీపడగా, విజయవాడ ఆడపడుచే విజేతగా నిలిచారు. మిసెస్ ప్లానెట్గా కిరీటం చేజిక్కించుకుని విజయవాడ చేరుకున్న నాగమల్లికకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం లభించింది. విజయవాడ ఆటోనగర్కు చెందిన నాగమల్లిక, 2019 లో మిసెస్ అమరావతి, 2020 లో మిసెస్ ఆంధ్రప్రదేశ్, 2021 లో మిసెస్ ఇండియా […]
విజయవాడ నుంచి నాగ్ పూర్ కు వెళ్లాలంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ టు ఆదిలాబాద్ మీదుగా దాదాపు 770 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి 13 గంటల సమయం పడుతుంది. ఇంత సమయం, ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఎవరికైనా ఇబ్బందే. కానీ త్వరలోనే ఈ సమస్యకు చెక్ పడబోతోంది. కొత్త ఎక్స్ప్రెస్ హైవేను విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, మంచిర్యాల మీదుగా నిర్మించన్నారు. దీంతో 163 కిలోమీటర్లు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ–నాగ్పూర్ ఎక్స్ప్రెస్ […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంట నగరాలు అంటే హైదరాబాద్ – సికింద్రాబాద్ మాత్రమే జ్ఞప్తికి వచ్చేవి. అభివృద్ధి పరంగా రెండు నగరాలు కలిసిపోవడంతో హైదరాబాద్ కు విశ్వ నగరంగా పేరుగాంచింది. విడిపోయి, ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని చంద్రబాబు మరింత లూటీ చేయడంతో దివాళా దుస్థితి దాపురించింది. ఖజానాలో కేవలం రూ.100 కోట్లను మాత్రమే ఉంచింది గత టీడీపీ ప్రభుత్వం. ఇలాంటి సమయంలో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వడివడిగా అడుగులు […]
విజయవాడ కృష్ణా నది తీరంలో 9 ఆలయాలను తిరిగి నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్.. ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఈ ఆలయాలను కృష్ణా నది పుష్కరాల సమయంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది. విజయవాడ నగరం, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో దాదాపు 40 ఆలయాలను నాటి సీఎం చంద్రబాబు కూల్చివేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా ఆలయాలను తిరిగి నిర్మిస్తామని […]
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ నిర్మాణ విషయంలో టీడీపీ నేతలు ఓ మౌలిక విషయం విస్మరించి జగన్ సర్కార్పై విమర్శలు చేస్తున్నారు. 2017 ఏప్రిల్ 16వ తేదీన బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 2019 మే వరకూ ఆయన అధికారంలో ఉన్నారు. అంటే విగ్రహా ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన తర్వాత రెండేళ్లు అధికారంలో ఉన్నారు. మరి 125 అడుగుల విగ్రహం […]
విజయవాడలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు విజయవాడలో లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత కృష్ణా జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, ఒంగోలు, శ్రీకాకుళంలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అదేబాటలో విజయవాడలో కూడా ఈ నెల 26 నుండి లాక్డౌన్ విధించనున్నట్లు నిత్యావసర సరుకులు ముందుగానే తెచ్చుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ […]
ఆంధ్రప్రదేశ్ లో లాక్డౌన్ సడలింపుల తర్వాత అనూహ్యంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా కరోనా కట్టడి సాధ్యపడటం లేదు. దీంతో అధికారులు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తిరిగి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న శ్రీకాకుళం,ఒంగోలు, అనంతపురంలో తిరిగి లాక్డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న విజయవాడలో కూడా లాక్డౌన్ విధించనున్నట్లు […]
కరోనా కారణంగా పాతాళానికి పడిపోయిన పెట్రోల్ ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్నాయి. వరసగా 11వ రోజు కూడా దేశంలో ఇంధన ధరలు పెరిగాయి. బుధవారం లీటరు పెట్రోల్ ధర హైదరాబాద్ లో 57 పైసలు పెరుగుదలతో రూ.80.22కు చేరుకుంది. డీజిల్ ధర 58 పైసలు పెరిగి రూ.74.07కు వెళ్లింది. రాబోయే కొద్ది రోజుల్లో ఇంధన రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. విజయవాడలో కూడా పెట్రోల్ ధర 56 పైసలు పెరుగుదలతో […]
విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో గ్యాంగ్ లీడర్ పండు తల్లిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు డీసీపీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. కుమారుడిలో నేర ప్రవృత్తిని పెంచినందుకు పండు తల్లిపై కేసును నమోదు చేసినట్లు తెలిపారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పండును డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. వివాదానికి కారణమైన ల్యాండ్ ఓనర్స్ శ్రీధర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డిలతో పాటు డీల్ మాట్లాడిన నాగబాబునూ విచారిస్తున్నామని తెలిపారు. విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ కేసుని అన్ని […]