iDreamPost
android-app
ios-app

విజయవాడలో భారీ వర్షం.. మరోసారి పొంచి ఉన్న ముప్పు..!

Vijayawada: విజయవాడను మళ్లీ భయపెడుతున్నాయి వానలు. ఆదివారం నుండి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో బుడమేరుకు వరద ఉధృతి పెరిగింది.

Vijayawada: విజయవాడను మళ్లీ భయపెడుతున్నాయి వానలు. ఆదివారం నుండి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో బుడమేరుకు వరద ఉధృతి పెరిగింది.

విజయవాడలో భారీ వర్షం.. మరోసారి పొంచి ఉన్న ముప్పు..!

ఇటీవల కురిసిన వర్షాలకు, వరదలకు విజయవాడ నగరం నీట మునిగింది. సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో జన జీవనం అస్తవ్యస్థం అయ్యింది. బుడమేరు పొంగి పొర్లడంతో ఒక్కసారిగా కాలనీలను ముంచేశాయి వరదలు. పీకల్లోతు నీళ్లు ఒకేసారి ఇళ్లల్లోకి వచ్చేయడంతో ఎగువ ప్రాంతాలకు పరుగులు తీశారు. నీరు, తిండి, నిద్రలేక తీవ్ర అవస్థలు పడ్డారు నగర వాసులు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బెజవాడను మరోసారి వాన భయపెడుతోంది. ఆదివారం నుండి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. భారీగా వర్షపాతం నమోదైంది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది.

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో జోరున వానలు పడుతున్నాయి. ఈ తుఫాను ప్రభావంతో విజయవాడలో కుంభ వృష్టిగా వాన కురుస్తోంది. ఆదివారం నుండి వానలు పడుతుంటడంతో మరోసారి ఆందోళన చెందుతున్నారు స్థానికులు. మళ్లీ నగరంలో వరద ప్రవాహం పెరిగింది. ఇటు ప్రకాశం బ్యారేజీతో పాటు బుడమేరుకు వరద నీరు వచ్చి చేరుతుంది. బుడమేరు కాలువకు పడిన గండ్లను పూడ్చిన తర్వాత అంతా సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు వానలు మరింత భయపెడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బెజవాడ నగరాన్ని మరోసారి వానలు ముంచెత్తుతున్నాయి.. మరోసారి బుడమేరు పొంగితే పరిస్థితి ఏంటన్న భయం వీడటం లేదు.

బుడమేరుకు గండి పూడ్చినా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సర్కార్ ఆదేశం ఇచ్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఇటు ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా భారీ వానలు ముంచెత్తుతున్నాయి. ఏపీలో విజయవాడను జడివాన కుదిపేయగా.. ఇటు తెలంగాణలో ఖమ్మాన్ని వర్షం కుమ్మేసింది. మళ్లీ ఖమ్మం జిల్లాలను ముంచెత్తుతోంది వాన. దీంతో మున్నేరు వాగు వరద ఉధృతి పెరిగింది. మున్నేరు వద్ద నీటి మట్టం 16 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి హెచ్చరికలు జారీ చేశారు. 24 అడుగులు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మరో 24 గంటల పాటు మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇల్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలను వెళ్లాలని అధికారులు కోరుతున్నారు.