P Venkatesh
Budameru canal: వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న విజయవాడ నగరానికి మరో ముప్పు పొంచి ఉంది. తాజాగా బుడమేరు కాలువకు గండ్లు పడ్డాయి. వరద నీరు చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాలు, ఇళ్లలోకి వరద నీరు చేరే అవకాశం ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. జోరుగా కురిసిన వానలతో వరదలు పోటెత్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ నగరం జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. వందలాది మంది వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుడమేరు కాలువ ధాటిగా ప్రవహిస్తుండడంతో విజయవాడ నగరంలో వరద నీరు చేరింది. ఇప్పుడు మరో ప్రమాదం పొంచి ఉన్నది. బుడమేరు కాలువకు గండ్లు పడ్డాయి. 35 వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో బుడమేరుకు గండ్లు పడ్డాయి. దీంతో వరద నీరు చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాలు, ఇళ్లలోకి వరద నీరు చేరే అవకాశం ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాలువలోని వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇళ్లు వదిలి బయటకు రావాలని అధికారులు స్థానికులకు సూచిస్తున్నారు. సహాయకచర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దమయ్యారు. ఇదిలా ఉంటే ఏపీకి మరో అల్పపీడన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడిస్తోంది.