iDreamPost
android-app
ios-app

వరదనీటిలో తిరిగిన బాలుడు.. కాలు తీసేసిన వైద్యులు! ఎందుకంటే..

NTR District: ఓ 12 ఏళ్ల బాలుడు వరద నీటిలో తల్లిదండ్రలకు సాయం చేశాడు. అయితే అలా వరద నీటిలో తిరగడమే ఆ బాలుడికి శాపంగా మారింది. చివరకు అతడి కుడి కాలును వైద్యులు తొలగించారు. మరి..అసలు ఏం జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

NTR District: ఓ 12 ఏళ్ల బాలుడు వరద నీటిలో తల్లిదండ్రలకు సాయం చేశాడు. అయితే అలా వరద నీటిలో తిరగడమే ఆ బాలుడికి శాపంగా మారింది. చివరకు అతడి కుడి కాలును వైద్యులు తొలగించారు. మరి..అసలు ఏం జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

వరదనీటిలో తిరిగిన బాలుడు.. కాలు తీసేసిన వైద్యులు! ఎందుకంటే..

నేటికాలంలో కొత్త కొత్త వ్యాధులు అనేవి పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలకు వివిధ రకాల వ్యాధులు అటాక్ చేస్తున్నాయి. కొన్ని సార్లు వైద్యులకు సైతం అంతచిక్కని వ్యాధులతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో చికిత్స అందక శరీరంలోని అవయవాలను తొలగించే పరిస్థితి ఏర్పడుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఏకంగా ప్రాణాలే పోతున్నాయి. అయితే తాజాగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలుడు వరద నీటిలో తిరగడమే శాపమైంది. వరద నీటిలో తిరిగిన కారణంగా ఏకంగా తన కాలునే కోల్పోయాడు. అసలు ఏం జరిగింది. ఎందుకు కాలు తీసే పరిస్థితి వచ్చింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఎన్జీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన భవదీప్ అనే 12 ఏళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి విజయవాడలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల  విజయవాడ వరద ముంపుకు గురైన సంగతి తెలిసింది. ఈ భారీ వరద కారణంగా విజయవాడలోనే  సగం ప్రాంతం నీట మునిగింది. అనేక ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. దాదాపు వారం రోజుల పాటు విజయవాడలోని చాలా ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. ఈ వరద బాధితుల్లో భవదీప్ కుటుంబం కూడా ఉంది. విజయవాడను వరదలు ముంచెత్తిన వేళ.. బాబు కుటుంబం ఉండే ఇంట్లోకి కూడా నీరు చేరింది.

ఈ క్రమంలో వరద నీరు తగ్గే వరకు బాలుడు కుటుంబంతో పాటు బాలుడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోని సామాన్లు తడవకుండా  అమ్మానాన్నలకు సాయం చేశాడు. అలా వరద నీటిలోనే చాలా  సమయం గడిపాడు. ఆ తరువాత రెండు రోజులకు  బాబు చలి జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరంతో పాటు వణుకుతో ఎంతో ఇబ్బంది పడ్డాడు. వైరల్ ఫీవర్ ఏమో అని స్థానిక ఆర్ ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆయన యాంటిబయోటిక్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ చేసి ఇంటికి పంపించాడు. అయినా బాలుడి ఆరోగ్యం పరిస్థితి ఏమాత్రం కుదుటపడలేదు. ఆ తర్వాత మరో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించారు.  వాటిల్లో ఆ బాలుడికి డెంగ్యూ సోకినట్లు తేలింది. ఇదే సమయంలో ఆ  బాలుడి తల్లిదండ్రులకు మరో షాక్ తగిలింది. బాలుడికి ఉన్నట్టుండి అకస్మాత్తుగా రెండు కాళ్లు బాగా వాపు వచ్చాయి. దీంతో కంగారు పడిన ఆ బాలుడి తల్లిదండ్రులు వెంటనే విజయవాడలోని ఓ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు నిర్ఘాంతపోయే వార్త చెప్పారు. ఆ బాలుడికి అత్యంత అరుదున ‘నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌’ వ్యాధి సోకినట్లు వెల్లడించారు. ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా భవదీప్ శరీరంలోకి చొచ్చుకుపోయి.. కండరాలను తినేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు ఇన్‌ ఫెక్షన్ మరింత పెరగకుండా జాగ్రత్త పడ్డారు. ఈ నెల 17న బాలుడి కుడి కాలును తొడ భాగం వరకు తొలగించారు. అదే సమయంలో బాలుడి ఎడమ మోకాలి కింద భాగంలో కూడా 30శాతం మేర కండను కూడా బాక్టీరియా తినేసినట్లు వైద్యులు గుర్తించారు. అయితే సాధారణంగా షుగర్ ఉన్నవారిలో ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది. కానీ ఎటువంటి గాయాలు లేకుండానే భవదీప్‌ శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎలా వెళ్లిందనే విషయం వైద్యులకు కూడా అంతుచిక్కడం లేదు. బాలుడి శరీరంలో కుళ్లిన భాగాల నుంచి తీసిన శాంపిల్స్  ను పరీక్ష చేసిన వైద్యులకు కొన్ని కీలక విషయాలు తెలిశాయి.

బాలుడి శరీరంలోకి ఈ-కోలి, క్లెబిసెల్లా సూక్ష్మక్రిములు వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. వరదనీటిలో మురుగునీరు కలిసినప్పుడు ఇలాంటి బ్యాక్టీరియా వ్యాప్తి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెప్పారు. మొత్తంగా వరద నీటిలో తిరిగిన కారణంగా ఆ బాలుడు తన కుడికాలును కోల్పోయాడు. ప్రస్తుతం ఐసీయూలో భవదీప్‌‌కు చికిత్స అందిస్తున్నారు.. అతను పూర్తిగా రికవరీ అయ్యేందుకు రెండు, మూడు నెలల వరకు సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. జ్వరం వచ్చినప్పుడు కాళ్ల వాపులు లాంటివి కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. మరి..ఈ వింత వ్యాధిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.