iDreamPost
android-app
ios-app

MD సజ్జనార్ కీలక నిర్ణయం.. HYD- విజయవాడ మధ్య టికెట్స్ ధరలు తగ్గింపు!

  • Published Sep 04, 2024 | 4:57 PM Updated Updated Sep 04, 2024 | 4:57 PM

RTC Big Relief for Passengers: గత వారం రోజులుగా తెలగంగాణ, ఏపీలో వరుసగా వర్షాలు పడుతున్ాయి. ఈ క్రమంలోనే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది.

RTC Big Relief for Passengers: గత వారం రోజులుగా తెలగంగాణ, ఏపీలో వరుసగా వర్షాలు పడుతున్ాయి. ఈ క్రమంలోనే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది.

MD సజ్జనార్ కీలక నిర్ణయం.. HYD- విజయవాడ మధ్య టికెట్స్ ధరలు తగ్గింపు!

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కంటిన్యూగా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని గ్రామాలకు పూర్తిగా కమ్యూనికేషన్లు తెగిపోయాయి. రోడ్లు కోట్టుకుపోవడంతో రావాణా సౌకర్యం పూర్తిగా స్థంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మరికొన్ని రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తుంది. తాజాగా ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

ఏపీ, తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలకు రవాణా వ్యవస్థ బాగా దెబ్బతిన్నంది. అనేక ప్రాంతాల్లో జాతీయ రహదారులు కొట్టుకుపోయాయి.. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ధరపై 10% రాయితీ కల్పిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఇది అన్ని ఏసీ, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సుల్లో ఇది వర్తిస్తుందని అన్నారు. ముందస్తు రిజర్వేషన్స్ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ https//www.tgsrtcbus.in లో చేసుకోవాలని ప్రయాణికులకు అధికారులు తెలిపారు.

ప్రకృతి బీభత్సానికి, వరుణుడి ఉగ్ర రూపానికి విజయవాడ గజగజలాడింది. బుడమేరు వాగు పొంగిపొర్లడతంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇండ్లలోకి నీరు రావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. కొంతమంది బయటకు రాలేక.. ఇంట్లో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయ దేవి నగర్, పైపుల్ రోడ్, ప్రకాశ్ నగర్ పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇరు రాష్ట్రాల ప్రజలకు ఊరట లభిస్తుందని అంటున్నారు.