P Krishna
Vijayawada Flood: గత వారం నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారిపోయింది. వరద బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా కొంతమంది దాతలు ముందుకు వస్తున్నారు.
Vijayawada Flood: గత వారం నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారిపోయింది. వరద బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా కొంతమంది దాతలు ముందుకు వస్తున్నారు.
P Krishna
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా వరదల ధాటికి విజయవాడ నగరం గజ గజ వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం నీటితో నిండిపోవడంతో అధికారులు పడవ సహాయంతో బాధితులకు సాయం చేస్తున్నారు. కొంతమందిని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వరదల కారణంగా ఇండ్లల్లో ఉండలేక, బయటకు రాలేక బాధితులు నరకం అనుభవిస్తున్నారు. విజయవాడలో వరద బాధితుల కోసం ఓ రైతు గొప్ప మనసు చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు సహాయక చర్యలు ప్రభుత్వం వేగవంతం చేసింది. హెలికాప్టర్లు, పడవలు వెళ్లలేని ప్రదేశాలకు డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో భీమవరం కు చెందిన రైతు పెద్ద మనసు చాటుకున్నాడు. పొలాల్లో మందులు పిచికారీ చేసే డ్రోన్ తో విజయవాడకు వెళ్లాడు.. ఆ డ్రోన్ సాయంతో ఆహారం అవసరం ఉన్నవాళ్లకు అందజేస్తున్నాడు.
వరదల్లో చిక్కుకొని బయటకు రాలేని పరిస్థితిలో ఉంటూ నిత్యావసర సరుకుల కోసం ఎదురు చూస్తున్న బాధితులకు డ్రోన్ సాయంతో అందిస్తున్నాడు. జక్కంపూడి, వాంబే కాలనీ ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి డ్రోన్ తో పాలు, బిస్కెట్లు, ఆహార పదార్ధాలు బాధితులకు చేరవేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నగర ప్రజలు రైతు శ్రీనివాస రావుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వరద బాధితుల ఇబ్బందులు తెలుసుకొని మంచి మనసుతో సాయం అందిస్తున్న రైతు శ్రీనివాసరావుకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.