iDreamPost
android-app
ios-app

మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం ఆదాయం, అప్పు వివరాలు ఇవే

  • Published Sep 21, 2024 | 11:15 AM Updated Updated Sep 21, 2024 | 11:15 AM

Manthena Satyanarayana Raju: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విజయవాడ లోని మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో వరద నీరు చేరింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అయితే ఇప్పుడు మంతెన ఆశ్రమం కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని సమాచారం. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Manthena Satyanarayana Raju: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విజయవాడ లోని మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో వరద నీరు చేరింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అయితే ఇప్పుడు మంతెన ఆశ్రమం కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని సమాచారం. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 21, 2024 | 11:15 AMUpdated Sep 21, 2024 | 11:15 AM
మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం ఆదాయం, అప్పు వివరాలు ఇవే

మంతెన సత్యనారాయణ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకృతి వైద్యులుగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అనేక రకాలా ఆరోగ్య సమస్యలకు సహజంగా చికిత్స అందిస్తూ ఉంటారు. ఈయనకు సంబంధించిన ఎన్నో వీడియోస్ ను టెలివిజన్ లోను , సోషల్ మీడియాలో కూడా చూస్తూనే ఉంటాము. ఇక విజయవాడలో మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉందన్న సంగతి తెలియనిది కాదు. న్యాచురల్ ట్రీట్మెంట్ కోసం ఎంతో మంది ఈ ఆశ్రమానికి వెళ్తూ ఉంటారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మంతెన ఆశ్రమంలో వరద నీరు చేరిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడిప్పుడే ఆశ్రమంలో అంతా యధాస్థితికి చేరుకుంటూ ఉంది. మళ్ళీ హెల్త్ క్యాంప్స్ ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో మంతెన తాజాగా రిలీజ్ చేసిన వీడియో ప్రకారం.. ప్రస్తుతం ఆ ఆశ్రమం కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని సమాచారం. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మంతెన తెలియజేసిన వివరాల ప్రకారం.. వరదల తర్వాత మళ్ళీ యధావిధిగా హెల్త్ క్యాంప్స్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రారంభమైన హెల్త్ క్యాంప్స్ ఫీజులు అధికంగా ఉన్నాయంటూ.. బిజినెస్ చేస్తున్నారంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘ఇండియాలో ఫస్ట్ బిగ్గెస్ట్ న్యాచురల్ కేర్ హాస్పిటల్ విజవాడలోని మంతెన ఆశ్రమం. ఇతర న్యాచురల్ కేర్ హాస్పిటల్స్ తో పోల్చితే.. ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తూ తక్కువ ఛార్జ్ చేసే ఆశ్రమం ఇదే . ఇక్కడ ట్రీట్మెంట్ కు ఛార్జ్ చేయరు. కేవలం డైట్ కు మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఈ ఇన్స్టిట్యూట్ న్యాచురోపతిని ఫాలో అయ్యే మిడిల్ క్లాస్ , ఎబోవ్ మిడిల్ క్లాస్ వారి కోసం స్థాపించింది. రూమ్ రెంట్, అక్కడ చెప్పే ఛార్జెస్ చెప్పి ఆమ్మో అనుకోవచ్చు. కానీ ఇక్కడకి వచ్చే వారికి హాస్పిటల్ ఫీలింగ్ రాకుండా.. ఆశ్రమం ఫీలింగ్ వచ్చేలా మైంటైన్ చేస్తూ ఉంటాము’ అంటూ మంతెన చెప్పారు. ఇలా ఆ ఆశ్రమంలో ఇంకా ఏమేమి ఉంటాయో కూడా మొత్తం క్లియర్ గా చెప్పారు.

అలాగే ఆశ్రమం ప్రస్తుత పరిస్థితి కూడా చెప్పారు. ఈ ఇన్స్టిట్యూట్ కేవలం బ్యాంక్ లోన్స్ , ప్రైవేట్ లోన్స్ , డొనేషన్స్ మీద సాగుతుందని. 12 సంవత్సరాల నుంచి రన్నింగ్ లో ఉన్న మీద ఇంకా సుమారు రూ.20 కోట్ల అప్పు ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ఆశ్రమంలో జాయిన్ అయ్యే వారు ఇచ్చే ఫీజులు మెయింటెనెన్స్ కే సరిపోతుందని.. ఇన్సిట్యూట్ నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా తాను తీసుకునని చెప్పారు. ఇలా తానూ ఇంతవరకు ఎలా ఎదిగారు అనేది కూడా చెప్పుకొచ్చారు మంతెన. అలాగే కోట్ల అప్పుల్లో ఆశ్రమం ఉన్నా సరే.. పేద వారికి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటామని కూడా తెలియజేశారు. కాబట్టి ఈ వీడియోతో .. వారికి ఆరోగ్యం పేరు చెప్పుకుని బిజినెస్ చేసే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పినట్లు అయింది. ఏదేమైనా వారికి తెలిసిన అరకొర ఇన్ఫర్మేషన్ తో ఎంతో మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా తానూ నడుపుతున్న సంస్థకు సంబంధించి ప్రతి విషయాన్నీ.. డీటెయిల్డ్ గా చెప్పేవారు చాలా కొంతమంది మాత్రమే ఉంటారు. మరి మంతెన చెప్పిన ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.