iDreamPost
android-app
ios-app

విజయవాడలో పర్యటించిన KA పాల్.. వరద బాధితులకు సాయం!

KA Paul: వర్షాలు, వరదలతో అతలాకుతలమైన విజయవాడ నగరంలో ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏపాల్ పర్యటించారు. నడుము లోతులో మునిగిన బెజవాడ నగరాన్ని చూసి చలించిపోయిన ఆయన..

KA Paul: వర్షాలు, వరదలతో అతలాకుతలమైన విజయవాడ నగరంలో ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏపాల్ పర్యటించారు. నడుము లోతులో మునిగిన బెజవాడ నగరాన్ని చూసి చలించిపోయిన ఆయన..

విజయవాడలో పర్యటించిన KA పాల్.. వరద బాధితులకు సాయం!

ఇటీవల ఏపీలో విస్తారంగా కురిసిన వర్షాలకు, వరదలకు విజయవాడ నగరం నీట మునిగింది. బుడమేరుకు గండిపడటంతో డాబాకోట్లు, సింగ్ నగర్, శాంతి నగర్, పైపుల్ రోడ్,  పాయకాపురం, రాజరాజేశ్వరి పేట, అంబాపురం వంటి ప్రాంతాలు జలదిగ్భంధానికి గురయ్యాయి. ఊహించని విధంగా నీరు ఇళ్లల్లోకి చేరడంతో.. హుటా హుటిన ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు స్థానికులు. మూడు రోజుల నుండి వరద నీటిలో చిక్కుకున్నారు. తిండి, నీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఇక చిన్న పిల్లలు, వృద్దులు పరిస్థితి వర్ణనాతీతం. వరదల్లో బెజవాడ నగరం చిక్కుకున్న రోజు నుండే సహాయక చర్యలు ముమ్మరంగా కొససాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ దళాలు రెస్య్కూ ఆపరేషన్ చేపడుతున్నాయి. అలాగే తిండి, నీరు లేక అవస్థలు పడుతున్న వాళ్లకు హెలికాఫ్టర్ల ద్వారా సాయం అందిస్తున్నారు.

బాధిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు భరోసానిస్తున్నారు రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్ష నేతలు. తాజాగా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా విజయవాడలో పర్యటించారు. వరద ముప్పు ప్రాంతంలో స్థానికుల సాయంతో పడవలో ప్రయాణించిన ఆయన.. అక్కడ పరిస్థితిని చూసి చలించిపోయారు. తన వెంట కొన్ని ఆహార పొట్లాలను తీసుకెళ్లి బాధితులకు అందజేశారు. మూడు రోజులుగా నగర వాసులు నీటిలో చిక్కుకుపోయారని, కొంత మంది ఆహారం అందుతుందని, మరికొంత మందికి ఫుడ్ అందట్లేదని అన్నారు. సుమారు 4 లక్షల మంది నీరు, తిండి లేక ఇబ్బందికి గురౌతున్నారని, వారికి తక్షణ సాయం అందించాలని, చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇలాంటి నష్టం మున్ముందు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు కేఎ పాల్.