P Venkatesh
APSRTC Apprentice Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ రిలీజ్ అయ్యింది. రాత పరీక్ష లేకుండానే జాబ్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడే అప్లై చేసుకోండి.
APSRTC Apprentice Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ రిలీజ్ అయ్యింది. రాత పరీక్ష లేకుండానే జాబ్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడే అప్లై చేసుకోండి.
P Venkatesh
టెన్త్, ఐటీఐ విద్యార్హతలతో రైల్వే డిపార్ట్ మెంట్, ఆర్టీసీ, ఇండస్ట్రియల్ సెక్టార్ లో అపారమైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అందుకే లైఫ్ లో త్వరగా స్థిరపడేందుకు ఐటీఐ కోర్సులు చేస్తుంటారు. చిన్న వయసులోనే జాబ్ పొంది సెటిల్ అవ్వొచ్చు. వృత్తి విద్యా కోర్సుల ద్వారా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుని స్వయం ఉపాధి పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం యూత్ ఐటీఐ కోర్సులు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వివిధ రకాల ట్రేడుల్లో శిక్షణ పొంది ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఐటీఐ పూర్తి చేసిన వారు ఆర్టీసీ వంటి సంస్థల్లో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్ ట్రేడుల్లో జాబ్ పొందొచ్చు. మరి మీరు కూడా ఐటీఐ పాసై ఖాళీగా ఉన్నారా? జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపికబురును అందించింది. అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాత పరీక్ష రాయకుండానే జాబ్ పొందే ఛాన్స్ కల్పిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 606 పోస్టులను భర్తీ చేయనుంది. విజయవాడ, కర్నూలు జోన్ల పరిధిలో వివిధ ట్రేడుల్లో ఈ పోస్టులు భర్తీకానున్నాయి. ఏపీఎస్‌ఆర్‌టీసీ కర్నూలు జోన్‌లో 295 అప్రెంటిస్ ఖాళీలు, ఏపీఎస్‌ఆర్‌టీసీ విజయవాడ జోన్‌లో 311 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఆర్టీసీలో జాబ్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఈ పోస్టులకు పోటీపడే వారు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఆయా ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
ఐటీఐ మార్కులు, ఇంటర్వ్యూ, సీనియారిటీ తదితరాల ఆధారంగా అప్రెంటిస్ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ ట్రేడుల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు విజయవాడ జోన్లలోని ఖాళీలకు ఆన్‌లైన్‌లో నవంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కర్నూల్ జోన్ పరిధిలోని ఖాళీలకు నవంబర్ 19న దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు రూ.118 చెల్లించాలి. అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన కొరకు ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడ. ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలులో హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.apsrtc.ap.gov.in ను పరిశీలించాల్సి ఉంటుంది.