మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత నూతనంగా మంత్రి పదవులు దక్కిన నేతలు..తమ బాధ్యతలను స్వీకరిస్తున్నారు.సోమవారం మంత్రులుగా 25 మంది ప్రమాణ స్వీకారం చేయగా.. అందులో ముగ్గురు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్లు మంగళవారం బాధ్యతలు చేపట్టగా.. ఈ రోజు బుధవారం మరికొంత మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. పర్యాటకశాఖ మంత్రిగా నియమితులైన ఆర్కే రోజా.. ఈ రోజు తన బాధ్యతలను చేపట్టారు. తన ఛాంబర్లో శాస్త్రో క్తంగా పూజలు నిర్వహించిన […]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జరిపిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్థానం సంపాదించి సినీరంగం నుంచి వచ్చి మంత్రి అయిన ఘనత సాధించారు. ఆమెకు ముందు ఇద్దరు మాత్రమే.. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర మంత్రులు అయిన ఘనత సాధించారు. టీడీపీ హయాంలో సినీనటులు ఎన్. శివప్రసాద్, బాబుమోహన్ మంత్రి పదవులు నిర్వహించారు. వాస్తవానికి సినీ-రాజకీయ రంగాల మధ్య బంధం ఈనాటిది కాదు. ఏపీలోనే కాకుండా […]
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ చుట్టూ వివాదం అలముకుంటోంది. విపక్షం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. పాలకపక్షం అదే తీరులో తిప్పికొడుతోంది. దాంతో వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా నారా లోకేశ్, ఇతర టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై అధికార పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ సవాల్ కూడా చేశారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని కొత్త పంథాలో ప్రభుత్వం చేపట్టింది. ఒక్క రోజులోనే 54లక్షల మందికి […]