Dharani
ఏపీలో సవాళ్ల పర్వం నడుస్తోంది. అధికార, విపక్ష నేతలు పరస్పరం సవాల్ విసురుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి రోజా.. నారా భువనేశ్వరికి సవాల్ విసిరారు. ఆ వివరాలు..
ఏపీలో సవాళ్ల పర్వం నడుస్తోంది. అధికార, విపక్ష నేతలు పరస్పరం సవాల్ విసురుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి రోజా.. నారా భువనేశ్వరికి సవాల్ విసిరారు. ఆ వివరాలు..
Dharani
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక బాబు అరెస్ట్ తర్వాత ఆయన భార్య నారా భువనేశ్వరి జనాల్లోకి వచ్చారు. ప్రస్తుతం నిజం గెలవాలి పేరుతో యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నారా భువనేశ్వరికి సవాల్ విసిరారు మంత్రి రోజా. తన ఆస్తుల మీద సీబీఐ విచారణకు తాను రెడీ అని.. అలానే భువనేశ్వరి కూడా వారి ఆస్తుల మీద విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఇంతకు ఏం జరిగింది అంటే.. టీడీపీ నేతలు కొందరు రోజా ఆస్తుల మీద సీబీఐ విచారణ జరపాలంటూ కామెంట్స్ చేశారు. వీటిపై స్పందిస్తూ.. మంత్రి రోజా.. నారా భువనేశ్వరికి సవాల్ విసిరారు.
భువనేశ్వరి కోరినట్లుగా తన ఆస్తులపై సీబీఐతో విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి రోజా స్పష్టం చేశారు. అలానే నారా భువనేశ్వరి కూడా తన ఆస్తులు, సంపాదన మీద సీబీఐ విచారణకు రెడీనా అని సవాల్ విసిరారు. గురువారం మంత్రి రోజా.. ఎంపీ మార్గాని భరత్‌తో కలిసి రాజమహేంద్రవరంలోని శ్రీ ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 1991లో చిత్ర పరిశ్రమకు వచ్చిన నాటి నుంచి తన సంపాదన ప్రారంభమైందని, దానిపై సీబీఐతో విచారణకు తాను సిద్ధమేనని తెలిపారు రోజా.
మరి అదే సమయంలో భువనేశ్వరి కూడా ఆమె ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అని మంత్రి రోజా సవాల్ విసిరారు. ఆర్థిక నేరగాడికి సంకెళ్లు వేస్తే మొత్తం రాష్ట్రానికే సంకెళ్లు వేసినట్టు భువనేశ్వరి వ్యాఖ్యానించడాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. అబద్ధాలు చెప్పడంలో భువనేశ్వరి భర్తను మించి పోయారని వ్యాఖ్యానించారు. మరి రోజా సవాల్ స్వీకరించి భువనేశ్వరి సీబీఐ విచారణకు రెడీ అవుతారా లేక చంద్రబాబులానే తోక ముడుస్తారా అని చర్చించుకుంటున్నారు జనాలు.