కేంద్ర ఆదాయపు పన్ను శాఖ చంద్రబాబు నాయుడికి నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ నోటీసులతో ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ నోటీసుల వల్ల చంద్రబాబు భవిష్యత్ ఏమవుతుందనే విషయం పక్కన పెడితే.. అధికార వైసీపీకి మాత్రం ఓ ఆయుధం దొరికినట్లైంది. దీంతో చంద్రబాబుపై వైసీపీ మంత్రులు, ఇతర నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బాబు భారీగా అవినీతికి పాల్పడ్డాడు అంటూ ఆరోపణలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మంత్రి ఆర్కే రోజా కూడా తనదైన స్టైల్ లో ప్రశ్నలతో బాబును రాజకీయంగా చితక్కొట్టారు. చంద్రబాబు అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటారని, ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు.
గురువారం మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై కీలక వ్యాఖ్యలు చేశఆరు. చంద్రబాబు జైలుకి వెళ్తే.. ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందన్నారు. అలానే రూ.118 కోట్ల ముడుపుల కేసులో విచారణ ఎదుర్కొనే దమ్ముందా? లేదా బాలకృష్ణలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా? అంటూ రోజా ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో తన ఇంట్లో కాల్పులు జరిగిన ఘటనలో నందమూరి బాలకృష్ణ.. మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకోవడాన్ని రోజా పరోక్షంగా ప్రస్తావించారు. అలాగే ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడ తాను ఫైల్స్ తో బాధ పడుతున్నానంటూ చికిత్స కోసం విజయ వాడలోని రమేశ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా బాబు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు.
విజయ్ మాల్యాలా విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. లోకేశ్, చంద్రబాబులను జైలులో పెడితేనే ప్రజలకు మేలని ఆమె అన్నారు. బాబు అడ్డంగా దొరికిపోయినప్పుడు ప్రజల సింపతి కోసం డ్రామాలు ఆడటం బాగా అలవాటని రోజా తెలిపారు. గతంలో ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన రాష్ట్రానికి పారిపోయి వచ్చాడని గుర్తు చేశారు. అలిపిరిలో బాబుపై బాంబు పేలినప్పుడే ఆయనకి సింపతి రాలేదని, బాబు అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందని రోజా పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో కూడా మోదీ తనను అరెస్ట్ చేస్తారని బాబు సింపతి డ్రామా ఆడారని, చంద్రబాబుని కచ్చితంగా అరెస్ట్ చేయాలని ఆమె అన్నారు. ముడుపుల కేసులో బాబును సీబీఐ, ఈడీ విచారించాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు. మరి.. రోజా వ్యాఖ్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.