iDreamPost
android-app
ios-app

నాకు టికెట్ ఇవ్వట్లేదని ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారు- మంత్రి రోజా

RK Roja: మంగళవారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొందరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

RK Roja: మంగళవారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొందరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాకు టికెట్ ఇవ్వట్లేదని ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారు- మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య వ్యూహ, ప్రతి వ్యూహాలు మొదలయ్యాయి. ముఖ్యకంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..  ప్రతిపక్షాల ఊహాలకు అందని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్ ల విషయంలో మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే 11 స్థానాల్లో మార్పులు చేశారు. ఇంకా మరికొన్ని స్థానాల్లో ఇంఛార్జ్ లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజాకు కూడా టికెట్ దక్కదని కొందరు ప్రచారం చేస్తున్నారు. అలా ప్రచారం చేసే వారికి మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంట్ర్ ఇచ్చారు.

మంగళవారం రాష్ట్ర పర్యాటక, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా తిరుమలకు వెళ్లి.. శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకలు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఇక శ్రీవారి దర్శన అనంతరం ఆమె బయట మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఆ స్వామి వారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఇదే సమయంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై రోజా మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని, ప్రతిపక్షాల, యెల్లో మీడియాపై ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారని రోజా  అన్నారు.

ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. పవన్‌, చంద్రబాబు ఎక్కడ పోటీ చేయాలో తెలియక, రెండేసి చోట్ల సర్వే చేయించుకుంటున్నారని రోజా దుయ్యబట్టారు. ప్రభుత్వం కార్యక్రమాలు ఏది  జరిగినా ముందు వరుసలో ఉండేది తానేనని, తాను సీఎం జగనన్నకు  సైనికురాలిని చెప్పుకొచ్చారు. జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం అంటూ ఏమోషనలయ్యారు. ఇక తన సీటుకు గురించి జరుగుతున్న అసత్య ప్రచారంపై కూడా స్పందించారు.

జగనన్న సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆయన వెంటే ఉంటాని ఆమె స్పష్టం చేశారు. మిషన్‌  2024లో 175/175లో భాగం అవుతానని ఆమె తెలిపారు. అలానే 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనా  మంత్రి రోజా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారామె. అయితే జగనన్న తీసుకునే ఏ నిర్ణాయనికైనా కట్టుబడి ఉంటామని తెలిపారు. ఆయన మాటే తనకు శిరోధార్యని  రోజా చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుడిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. మరి.. ఎల్లో మీడియాపై మంత్రి ఆర్కే రోజా చేస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.