iDreamPost
android-app
ios-app

మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. బండారుపై రాధిక ఫైర్‌!

  • Published Oct 06, 2023 | 10:06 PM Updated Updated Oct 07, 2023 | 4:36 PM
  • Published Oct 06, 2023 | 10:06 PMUpdated Oct 07, 2023 | 4:36 PM
మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. బండారుపై రాధిక ఫైర్‌!

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సామాన్య ప్రజలు సైతం బండారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రాజకీయ, సినీ ప్రముఖులు ఒక్కోరిగా మంత్రి రోజాకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. తాజాగా, సీనియర్‌ నటి రాధిక.. రాజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. బండారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 రాధిక ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో.. ‘‘గౌరవనీయులైన మంత్రి, నటి, ఓ మంచి స్నేహితురాలు రోజాగారు. నేను మీ వైపున ఉన్నాను. ఓ స్నేహితురాలిగా.. సహ నటిగా..నువ్వు ఏంటో బాగా తెలిసిన వ్యక్తిగా.. ఈ రోజున నేను మీ వైపు నిల్చున్నాను. గత కొద్దిరోజులుగా జరుగుతున్న సంఘనలను చూస్తుంటే బాధేస్తోంది. నీఛ రాజకీయాలకు పాల్పడుతున్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకెళుతున్న ఈ సమయంలో ఇలాంటివి జరగటం బాధాకరం.

ఓ పార్టీకి చెందిన ఓ గౌరవనీయులైన వ్యక్తి అనుచిత కామెంట్లు చేయటం సిగ్గుచేటు. భారత మాతగా గౌరవించుకునే స్త్రీలపై ఇలాంటి కామెంట్లు చేయటం రాజకీయాలకే సిగ్గుచేటు. ఆడవాళ్లను తిట్టాలంటే అంతమాట అంటారా? ఏంటి ఆ మాటలు. అలాంటివి చూసి మేము భయపడతాం.. ఆడవాళ్లందరూ భయపడతారు అనుకుంటే మీరు చాలా తప్పు చేస్తున్నట్లే.. ఎవ్వరూ భయపడరు. అలా మాట్లాడటానికి మాకు ఎంతో సమయం పట్టదు. ఓ పురుషుడిగా.. కుటుంబం ఉన్న వ్యక్తిగా బాధ్యతగా ప్రవర్తించండి. రోజాకు సారీ చెప్పండి’’ అని అన్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetparkgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom