Arjun Suravaram
క్రీడాభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ కు సంబంధించిన ప్రైజ్ మనీ భారీగా ఉంది. మరి.. ఆవివరాలు..
క్రీడాభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ కు సంబంధించిన ప్రైజ్ మనీ భారీగా ఉంది. మరి.. ఆవివరాలు..
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యం వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇదే సమయంలో క్రీడా రంగంలో కూడా అనేక సంస్కరణ తీసుకొచ్చారు. తాజాగా క్రీడాభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భారీ ఫ్రైజ్ మనీ ఉంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం….
ఏపీలోని యువతను క్రీడారంగలో ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘ఆడుదాం ఆంధ్రా’ కి సంబంధించిన క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంఛ్, బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో శాఫ్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదని ఆమె తెలిపారు.
ప్రస్తుతం యువతలో ఫిజికల్ ఫిట్నెస్ సరిగా ఉండటం లేదని మంత్రి రోజా అన్నారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం యువతకు మంచి అవకాశం అని చెప్పారు. టోర్నమెంట్‌లో 12 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తామని ఆమె తెలిపారు. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి. టోర్నమెంట్ లో పాల్గొనేందుకు 72 గంటల్లో 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇంతమంచి అవకాశం మళ్లీ వస్తుందో లేదో.. ఈ ఛాన్స్ ను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఇదే సందర్భంగా శాప్ ఛైర్మన్ సిద్ధార్ రెడ్డి మాట్లాడుతూ… రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడే వస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉండేదని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రతీ నాయకుడిని నిత్యం ప్రజల్లో ఉండేలా చూశారని ఆయన తెలిపారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద క్రీడా సంబరం అని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆయన తెలిపారు.
అలానే ఈ టోర్నమెంట్లో ఆడిన వారికి చెన్నై,ముంబై ఇండియన్స్ టీమ్స్ సభ్యులతో కలవచ్చని చెప్పుకొచ్చారు. సీఎం కప్, శాప్ లీగ్ వంటి కార్యక్రమాలతో యువతను ప్రోత్సహిస్తున్నారని, జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆడిన క్రీడకారులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని సిద్ధార్ధ్ రెడ్డి తెలిపారు. మరి.. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఆడుదాం ఆంధ్రలో రాణిస్తే CSK,ముంబై ఇండియన్స్ టీంలకు ఎంపిక 👌
– బైరెడ్డి సిద్దార్థ రెడ్డి pic.twitter.com/RAKFhZIwgJ
— Rahul (@2024YCP) December 1, 2023