iDreamPost
android-app
ios-app

మహేష్ బాబు కుటుంబంలో పెళ్లి సందడి!

  • Published Sep 02, 2023 | 1:33 PM Updated Updated Sep 02, 2023 | 1:33 PM
  • Published Sep 02, 2023 | 1:33 PMUpdated Sep 02, 2023 | 1:33 PM
మహేష్ బాబు కుటుంబంలో పెళ్లి సందడి!

తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతోమంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ అతి కొద్దిమందే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు. తన సోదరుడు రమేష్ బాబు నటించిన ‘నీడ’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన తర్వాత ‘రాజకుమారుడు’ సినిమాతో హీరో అయ్యారు. వెండితెరపైనే కాదు.. ఎన్నో యాడ్స్ లో నటిస్తూ బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. మాస్, క్లాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు మహేష్ బాబు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా మహేష్ బాబు కుటుంబంలో పెళ్లి సందడికి మొదలైంది. వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ మూవీ షూటింగ్ లో ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రం ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ గా రాబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. తాజాగా మహేష్ బాబు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. మహేష్ బాబు కి దగ్గర బంధువులు ఘట్టమనేని వర ప్రసాద్-అపర్ణ దంపతుల కూతురు డాక్టర్ దామిని వివాహం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్ లో ఎంతో ఘనంగా జరిగింది. ప్రముఖ డాక్టర్ సునీల్ కేనేరు దంపతుల కుమారుడు డాక్టర్ సేతు సందీప్ తో దామిని కొత్త జీవితాన్ని ఆరంభించనుంది.

ఈ వివాహ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన వారు విచ్చేశారు. దగ్గరి బంధువులు కావడంతో మహేష్ బాబు ఈ వివాహమహోత్సవానికి విచ్చేశారు. మహేష్ బాబు రావడంతో అక్కడ ఒక్కసారే సందడి వాతావరణం నెలకొంది. ఈ వివాహానికి సినీ నటి, మంత్రి రోజా కూడా విచ్చేశారు. మహేష్ బాబుని కలుసుకొని కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా రోజా.. మహేష్ బాబు తో సెల్ఫీ తీసుకుంది. అలాగే నూతన వధూవరులతో ఫోటోలు దిగింది. ఆ ఫోటోలు నటి రోజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Roja Selvamani (@rojaselvamani)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş