P Krishna
P Krishna
భారతీయ చలన చిత్ర రంగంలో తనదైన నటన, స్టైల్ తో చెరగని ముద్ర వేశారు సూపర్ స్టార్ రజినీకాంత్. యావత్ భారతదేశం గర్వించ దగ్గ నటుల్లో రజినీకాంత్ ఒకరు. ఆయనకు మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. రజీనీకాంత్ ని అభిమానులు తలైవర్ పిలుచుకుంటారు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్న రజినీ ఆరుపదులు దాటినా ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ తన సత్తా చాటుతున్నాడు. ఆ మద్య విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలో రజినీకాంత్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తూ.. మండిపడ్డారు. వీరిలో మంత్రి రోజా కూడా ఉండటంతో ఆమెపై రజినీ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ విషయంపై ఆమె మరోసారి స్పందించారు. వివరాల్లోకి వెళితే..
ఈ రోజు మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘రజినీకాంత్ ని నేను ఎప్పుడూ విమర్శించలేదు..ఆయన ఎంత గొప్ప నటుడో అందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్‌తో ఆయనకు ఉన్న అనుబంధం, గొప్పతనం గురించి చెప్పి ఉంటే అందరం మెచ్చుకునేవాళ్లం.. కానీ చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివారు. చంద్రబాబు పరిపాలన, విజనరీ చాలా గొప్పగా ఉందని.. ఆయనకు మరోసారి పట్టం కడితే ఏపీని ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలోకి తీసుకువ వస్తారని’ అని రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను నేను ఖండించాను. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎంతో గొప్ప స్థానం ఉంది. అలాంటి వ్యక్తి 14 ఏళ్ల సీఎం గా ఉండి ఏదీ సాధించని చంద్రబాబు గురించి మాట్లాడటం వల్ల ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అన్నాను.
తమిళనాడులో ఓ సినీ ఫంక్షన్లో రజినీకాంత్ ఎవరినో ఉద్దేశించిన మాట్లాడితే.. ఆ డైలాగ్ తమకు అనుదించి కొంతమంది ట్రోల్ చేస్తున్నారని అన్నారు. లోకేష్ పాద యాత్రలో అధికార పార్టీపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని.. ప్రతి ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఏపీలో చంద్రబాబు కు ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఇల్లు లేవు.. కానీ హైదరాబాద్ నుంచి వచ్చి ఏపీలో ఉన్న వైసీపీ నేతలపై విమర్శలు చేస్తారని విమర్శించారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ విషయానికి వస్తే.. ఈ మద్యనే నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు.